సూపర్‌మూన్ మళ్లీ వచ్చింది... అత్యంత ప్రకాశవంతమైన చంద్రబింబానికి 'బక్ మూన్' అనే పేరెందుకు పెట్టారు?

సూపర్ మూన్

ఫొటో సోర్స్, Getty Images

ఇవాళ బుధవారం (జూలై 13) రాత్రి మీరు ఆకాశంలోకి చూస్తే మీకు అత్యంత ప్రకాశవంతమైన, పెద్దదైన చంద్రబింబం కనిపిస్తుంది. ఇది ఈ ఏడాదిలో కనిపించే అదిపెద్ద, కాంతిమంతమైన చంద్రబిబింబం.

గత నెలలో కనిపించిన 'స్ట్రాబెర్రీ మూన్' కనిపించినప్పుడు సోషల్ మీడియాలో కనిపించిన హడావిడి అంతా ఇంతా కాదు. చాలా మంది అందంగా కనిపించిన చంద్రుడి ఫోటోలు తీసి షేర్ చేసుకున్నారు. స్ఠాబెర్రీ పంట చేతికొచ్చే సమయంలో కనిపించడంతో దానికి స్టాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు.

ఆ చంద్రుడిని చూడడం మీరు మిస్సయ్యారా? మరేం ఫర్వాలేదు. బుధవారం రాత్రి ఆకాశంలో మీరు మళ్లీ సూపర్ మూన్‌ను చూడవచ్చు. ఈనాటి పూర్ణ చంద్రుడికి 'బక్ మూన్' అని పేరు పెట్టారు.

భూకక్ష్యలో సమీప ప్రాంతానికి చంద్రుడు రావడం వల్లే ఈ అద్భుతం కనిపిస్తోంది. భూమి చుట్టూ వలయాకారంలో పరిభ్రమించే చంద్రుడు జూలై 13న భూమికి అతి దగ్గరగా 3,57,264 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.

నాసా అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, "పూర్ణ చంద్రుడు ఈస్టర్న్ డేలైట్ టైమ్ (EDT) ప్రకారం జూలై 13 బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కనిపిస్తాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటాక 12.08 గంటల నుంచి నిండు చందమామ దర్శనమిస్తుంది. అంటే, అప్పటికి 14 తేదీ వస్తుంది. దాదాపు మూడు రోజుల పాటు చంద్రుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు."

సూపర్ మూన్

ఫొటో సోర్స్, BBC Sport

సూపర మూన్ అంటే ఏంటి?

చంద్రుడు తన కక్ష్యలో భూమికి 90 శాతం సమీపానికి (పెరిగీ) వచ్చినప్పుడు ఈ అద్భుతం దర్శనమిస్తుంది. అప్పుడు కనిపించేదే సూపర్ మూన్.

చంద్రుడి కక్ష్యం వలయాకారంలో ఉంటుంది. అంటే, భూమి నుంచి అది ఉండే దూరం మారుతూ ఉంటుంది. భూమికి అత్యంత దూరంలో (అపోగీ) వద్ద ఉన్నప్పుడు కనిపించే చంద్రుడితో పోల్చితే, పెరిగీ వద్ద చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక కాంతిమంతంగా కనిపిస్తాడని గ్రీన్‌విచ్ రాయల్ అబ్జర్వేటరీలో పని చేతున్న ఖగోళ శాస్త్రవేత్త టానియా డి సేలెస్ మార్క్వెజ్ అన్నారు.

చంద్రోదయం అయిన వెంటనే 'మూన్ ఇల్యూజన్'గా పిలిచే ఆప్టికల్ ఎఫెక్ట్ మూలంగా చంద్రుడు మరింత పెద్దగా కనిపించే అవకాశం ఉందని ఆమె అన్నారు. నిర్మల మైదానంలోంచి వీక్షించే వారికైతే అదో గొప్ప అనుభవమని మార్క్వెజ్ వివరించారు.

Male deer with antlers in front of the Moon

ఫొటో సోర్స్, Getty Images

బక్ మూన్ అని ఎందుకంటారు?

ఒకప్పుడు ఈశాన్య అమెరికాలో ఉండే అల్గాన్క్విన్ నేటివ్ అమెరికన్స్ పూర్ణ చంద్రుడిని బక్ మూన్ అని పిలిచేవారని మయిన్ ఫార్మర్ రచన ఆల్మనాక్‌ చెబుతోందని నాసా తెలిసింది. బక్ జింకలు, అంటే కొమ్ముల జింకలకు కొత్త కొమ్ములు పెరిగే రోజుల్లో చంద్రుడు ఇలా కనిపిస్తాడు కాబట్టి, దీనికి బక్ మూన్ అని పేరు పెట్టారని నాసా వివరించింది.

అలాగే, హిందువులు, బౌద్ధులు, జైనులకు కూడా ఈ పౌర్ణమి చాలా ముఖ్యమైనది. దీనిని వారు గురుపూర్ణిమ అంటారు. ఈ మతాలకు చెందిన వారు గురుపూర్ణిమను 'మనసును ప్రక్షాళన చేసుకుని గురువును గౌరవించుకునే' రోజుగా భావిస్తారు.

సూపర్ మూన్ అనే మాటను ఖగోళవేత్త రిచర్డ్ నోల్ 1979లో సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)