సూపర్ బ్లూ బ్లడ్ మూన్: ప్రపంచం నలుమూలల్లో ఇలా కనిపించింది

ఫొటో సోర్స్, AFP
సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌గా పిలుస్తున్న చంద్ర గ్రహణం బీజింగ్‌లో ఇలా కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
అరుదుగా వచ్చే ఈ చంద్ర గ్రహణాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు దీన్ని చూశారు. పై చిత్రం బ్యాంకాక్‌లో ఒక ఆలయం వద్ద తీసింది.

ఫొటో సోర్స్, EPA
చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. పై చిత్రం మయన్మార్ రాజధాని న్యాపిడాలో తీసింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ చిత్రం న్యూయార్క్ సమీపంలో తీసింది. 150 ఏళ్లలో తొలిసారి ఈ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఏర్పడింది. అమెరికాతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు యూరప్‌ల్లో కూడా ఇది కనిపించింది.

ఫొటో సోర్స్, AFP
సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. పై చిత్రం ఇండోనేషియా రాజధాని జకార్తాలో తీసింది.

ఫొటో సోర్స్, EPA
అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఎర్రగా ఉన్నట్లే.. ఇప్పడు చంద్రుడు ఎర్రగా కనిపించాడు. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే.. సూర్య కిరణాలు భూమిపై నుంచి చంద్రుడిపై పడితే.. ఇలా జరుగుతుంది. పై చిత్రం కాలిఫోర్నియాలో తీసింది.
ఇది ఎలా ఏర్పడుతుంది?
సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఎలా ఏర్పడుతుందో సులభంగా వివరించే వీడియో ఇది. చూడండి..
ఆకాశంలో అద్భుతం..
మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి వచ్చిన ఈ చంద్ర గ్రహణాన్ని నాసా ఇలా బంధించింది..
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో ఇలా..
సూపర్ బ్లూ బ్లడ్ మూన్ భారతదేశంలో కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది దీన్ని చూశారు. ఈ చిత్రాలను బీబీసీ మరాఠీ ప్రతినిధి రాహుల్ రాన్‌శుభే చిత్రీకరించారు.





చంద్రగ్రహణంపై అపోహలు
అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అంటే ఏంటి? గ్రహణం గురించి ప్రచారంలో ఉన్న పలు అపోహలు, పలువురి అనుమానాలపై బీబీసీ ప్రతినిధి బళ్ళ సతీశ్ హైదరాబాద్ నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన రఘునందన్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఇందులో మాట్లాడారు.
ఇవి కూడా చూడండి:
- అంతరిక్షంలో పిజ్జా.. తయారైందిలా
- తారా జువ్వల్లా రాకెట్ల తయారీ
- మేఘాల పైకెళ్లి మెరుపులు చూద్దామా!
- ఈమె స్పేస్ సూట్లు కుట్టే టైలర్
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
- ఆరు వేల కిలోమీటర్లు, అరగంటలో!
- 2017: సైన్స్‌లో 8 కీలక పరిణామాలివే!
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
- ఇక పైవాడు జూమ్ చేసి చూస్తాడు!
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- నలభై ఏళ్లుగా అంతరిక్షంలో భారతీయ పాట
- బీబీసీ షోలో గెలిచింది..ఆస్ట్రోనాట్ అయ్యే అవకాశం పొందింది
- కస్సీని మహాప్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










