యుక్రెయిన్‌లో మేయర్లను మార్చేస్తున్న రష్యా సైన్యం.. నకిలీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోందన్న జెలియెన్‌స్కీ

దక్షిణ యుక్రెయిన్‌ పట్టణం డ్నిప్రొరుడ్నె మేయర్ యెవ్హెన్ మట్వెయెవ్‌ను రష్యా అపహరించిందని యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డ్మిత్రో కులేబా ట్వీట్ చేశారు

ఫొటో సోర్స్, Dmytro Kuleba

ఫొటో క్యాప్షన్, దక్షిణ యుక్రెయిన్‌ పట్టణం డ్నిప్రొరుడ్నె మేయర్ యెవ్హెన్ మట్వెయెవ్‌ను రష్యా అపహరించిందని యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డ్మిత్రో కులేబా ట్వీట్ చేశారు

రష్యా సైన్యం మరొక మేయర్‌ను అపహరించిందని యుక్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది. తాను చేజిక్కించుకున్న ప్రాంతాల్లో మేయర్లను మార్చేస్తోందనే ఆరోపణలూ వస్తున్నాయి.

దక్షిణ యుక్రెయిన్‌ పట్టణం డ్నిప్రొరుడ్నె మేయర్ యెవ్హెన్ మట్వెయెవ్‌ను రష్యా అపహరించిందని యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డ్మిత్రో కులేబా ట్వీట్ చేశారు. రష్యా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇంతకు ముందు మెలిటోపోల్‌ నగరం మేయర్‌ను రష్యా సైన్యం అపహరించి, ఆయన స్థానంలో వేరొకరిని నియమించిందని యుక్రెయిన్ ఆరోపించింది.

తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రష్యా 'నకిలీ ప్రభుత్వా'లను తయారు చేస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆరోపించారు.

సిటీ క్రైసిస్ సెంటర్‌లో ఉన్న ఫెడొరోవ్‌ను శుక్రవారం సాయంత్రం కొందరు సాయుధులు బయటకు లాక్కొచ్చారు

ఫొటో సోర్స్, Reuters/handout

ఫొటో క్యాప్షన్, సిటీ క్రైసిస్ సెంటర్‌లో ఉన్న ఫెడొరోవ్‌ను శుక్రవారం సాయంత్రం కొందరు సాయుధులు బయటకు లాక్కొచ్చారు

'సరికొత్త వాస్తవం'

మెలిటొపోల్ కొత్త మేయర్ గలీనా డానిల్‌చెన్కో తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. 'అతివాద చర్యలకు' పాల్పడొద్దని ప్రజలను కోరారు. సరికొత్త వాస్తవం ఆధ్వర్యంలో కనీస యంత్రాంగాలను నిర్మించడమే తన ప్రధాన కర్తవ్యం అని ఆమె ప్రకటించారు.

కాగా, పాత మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను విడుదల చేయాలంటూ శనివారం సిటీహాల్ బయట వందలాది మంది ప్రజలు ప్రదర్శన జరిపారు. నగరంపై దండెత్తిన మూడోరోజున తమకు సహకరించడం లేదనే కారణంతో ఫెడొరోవ్‌ను రష్యా సైన్యం అపహరించింది.

సిటీ క్రైసిస్ సెంటర్‌లో ఉన్న ఫెడొరోవ్‌ను శుక్రవారం సాయంత్రం కొందరు సాయుధులు బయటకు లాక్కొచ్చారు. అప్పుడు ఆయన తలపై ఒక బ్యాగు కూడా కనిపించింది.

ఈ వీడియోను యుక్రెయిన్ అధికారులు షేర్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న సాయుధులు రష్యా సైనికులు అని పేర్కొన్నారు.

''మేం రష్యన్లకు ఏమాత్రం సహకరించట్లేదు'' అని ఫెడొరోవ్ కొద్దిరోజుల కిందటే బీబీసీతో చెప్పారు. ''వాళ్లు మాకు సహాయం చేసేందుకు ప్రయత్నించలేదు. వాళ్లు మాకు సహకరించరు. వాళ్ల సహాయం మాకు అక్కర్లేదు'' అన్నారు.

వీడియో క్యాప్షన్, రష్యాను రష్యన్లే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...

కాగా, ఈ వ్యవహారంపై రష్యా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, రష్యా మద్దతు ఉన్న, తూర్పు యుక్రెయిన్ నుంచి విడిపోయిన లుహాన్క్స్ ప్రాంతం మాత్రం ఆయన ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

ఫెడొరోవ్‌ను తక్షణం విడుదల చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీ డిమాండ్ చేశారు. ఆయన్ను విడిచిపెట్టేలా రష్యాపై ఒత్తిడి తేవాలని ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్ నాయకులను కోరారు.

శనివారం రాత్రి ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ.. యుక్రెయిన్‌లో రష్యా నకిలీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు.

రష్యా నియంత్రణలో ఉన్న ఖెర్సన్ ప్రాంతంలో.. ఆ సైన్యానికి సహకరించకుండా, వారితో కలవకుండా ఉన్న ప్రజలందరినీ అభినందించారు.

రష్యా ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక రెఫరండం నిర్వహిస్తున్నట్లు కుట్రపన్నుతోందని, అయితే.. స్థానిక కౌన్సిల్ మాత్రం యుక్రెయిన్‌ నుంచి ఎప్పటికీ తాము వేరుకామని తీర్మానం చేసిందని ప్రకటించారు.

డానిల్‌చెన్కోను ఉద్దేశిస్తూ.. ఎవరైనా అలా రష్యా సైన్యంతో చేతులు కలిపితే వ్యక్తిగతంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలియెన్‌స్కీ హెచ్చరించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న మిలటరీ జంట

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)