యుక్రెయిన్ సంక్షోభం: ఆకాశంలో ఆయుధాల గర్జన, మంటల్లో నగరాలు - ఇవీ యుద్ధ చిత్రాలు

యుక్రెయిన్ యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయాయి. కీయెవ్ సహా వివిధ నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యా భారీగా దాడులు జరుపుతోంది. ఎయిర్‌స్ట్రైక్స్ సైరన్లతోనే యుక్రెయిన్ ప్రజలు నిద్ర లేస్తున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా ఎయిర్‌స్ట్రైక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోకి చొచ్చుకువెళ్లడంలో రష్యా నెమ్మదిగా ఉన్నప్పటికీ ఎయిర్‌స్ట్రైక్స్‌ను తీవ్రం చేసింది. యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్‌కు తూర్పున బారీషివ్కాలో ఆకాశంలో క్షిపణి జాడ.
మంటల్లో కాలుతున్న ఆహార గోదాం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది కలినివ్కాలోని ఓ ఆహార గోదాం. రష్యా దాడిలో ఇది మంటల్లో తగలబడింది.
ఖార్కియెవ్‌లో విధ్వంసం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సైనిక లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నామని రష్యా చెబుతోంది. కానీ, రష్యా విచక్షణారహితంగా పౌరుల ఆస్తులనూ లక్ష్యంగా చేసుకుంటోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న నగరం ఖార్కియెవ్.
బాధితులకు అందించేందుకు ఆహారం సిద్ధం చేస్తున్న వలంటీర్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇప్పటికే 15 లక్షల మంది యుక్రెయిన్‌ను వీడారు. మందుల దుకాణాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలు బారులు తీరుతున్నారు.
గాయపడిన సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధంలో ఎంతమంది మరణించారన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ పెద్దసంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. రష్యా దాడుల్లో ఎందరో క్షతగాత్రులయ్యారు.
మరియుపూల్‌లో ధ్వంసమైన భవనాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రేవు పట్టణం మరియుపూల్‌ రెండు వారాలుగా రష్యా దిగ్బంధంలో ఉంది. ఇక్కడ రష్యా ఎడతెరిపిలేకుండా దాడి చేస్తుండడంతో మృతదేహాలను తొలగించడం కూడా సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఆయుధాలు

ఫొటో సోర్స్, SCOTT PETERSON/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మికోలీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా బలగాలు భారీగా షెల్లింగ్ జరుపుతున్నాయి. క్లస్టర్ బాంబులను రష్యా ప్రయోగిస్తోంది ఇక్కడ.
మంటల్లో కాలుతున్న ఇళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోనూ రష్యా తన దాడులను తీవ్రం చేసింది. తాజాగా ద్నిప్రో పట్టణంపై భారీగా బాంబుల వర్షం కురిపించింది.
కీయెవ్ చుట్టూ తవ్వుతున్న కందకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజధాని కీయెవ్‌ చుట్టూ రష్యా సేనలు మోహరించి ఉన్నాయి. కీయెవ్‌లో రష్యా సాయుధ వాహనాల కాన్వాయ్ ప్రవేశించడానికి నిరోధించడానికి యుక్రెయిన్ సైనికులు, వలంటీర్లు శ్రమిస్తున్నారు. నగరం చుట్టుూ భారీ కందకాలు తవ్వుతున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. కీయెవ్ నగరం ఒక కోటలా మారుతోందని అక్కడి బీబీసీ కరెస్పాండెంట్ జెరెమీ బోవెన్ చెప్పారు.
వంటలు

ఫొటో సోర్స్, DIMITAR DILKOFF/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రష్యాతో పోరాడుతున్నవారికి తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కీయెవ్, పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వంటలు చేస్తూ ఆహారం అందిస్తున్నారు.