భార్య కావాలంటూ హోర్డింగులపై ప్రకటనలిచ్చిన యువకుడు

యువకుడు

ఫొటో సోర్స్, Muhammad Malik

బ్రిటన్‌లో ఓ 29 ఏళ్ల బ్యాచిలర్.. తనకు భార్య కావాలంటూ భారీ ఎత్తున హోర్డింగులపై ప్రకటనలు ఇచ్చారు.

‘‘పెద్దలు కుదిర్చే పెళ్లి నుంచి నన్ను కాపాడండి’’ అంటూ లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ముహమ్మద్ మాలిక్ ఇచ్చిన ప్రకటనలతో హోర్డింగులు వెలశాయి.

ఆ విధానానికి తాను వ్యతిరేకం కాదని.. కానీ ‘‘ముందు తానే సొంతంగా తన భాగస్వామిని వెదికి పట్టుకోవాల’’ని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.

లండన్‌లో బ్యాంక్ కన్సల్టెంట్‌గా పనిచేసే ఈ యువకుడి అన్వేషణ ఇప్పటివరకూ ఫలించలేదు.

దీంతో findmalikawife.com అనే యూఆర్ఎల్‌తో ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అతడు ప్రారంభించాడు. దీనిద్వారా అయినా తన అదృష్టం మారుతుందని ఆశిస్తున్నారు.

Muhammad Malik

ఫొటో సోర్స్, Muhammad Malik

శనివారం ఈ ప్రకటనలు ఇచ్చినప్పటి నుంచి.. ఆసక్తి కనబరుస్తూ తనకు వందలాది మెసేజ్‌లు వచ్చాయని మాలిక్ చెప్తున్నారు.

‘‘సమయం లేకపోవటంతో వాటన్నిటినీ ఇంకా పరిశీలించలేదు. ఇందుకోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంది. ఈ అంశం గురించి ముందుగా ఆలోచించలేదు’’ అని వివరించారు.

ఈ హోర్డింగులు పెట్టటానికి ముందు మహిళలను కలవటానికి తాను అనేక మార్గాలను ప్రయత్నించానని మాలిక్ తెలిపారు.

‘‘కొన్ని డేటింగ్ యాప్‌లు వాడాను. డేటింగ్ ఈవెంట్లకు హాజరయ్యాను. కానీ అవి చాలా వింతగా అనిపించాయి. చివరికి.. ప్రకటనలు ఇవ్వమని ఒక మిత్రుడు సూచించాడు. ‘ఎందుకు ఇవ్వకూడదు? అందులో తప్పేముంది?’ అని నేను అనుకున్నాను’’ అని మాలిక్ వివరించారు.

వీడియో క్యాప్షన్, హిందూ-ముస్లిం పెళ్లి: ‘ప్రేమ పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం’

మాలిక్ ఈ హోర్డింగులను జనవరి 14వ తేదీ వరకూ కొనసాగించేలా ఏర్పాటు చేశారు. దీనికి తన కుటుంబం కూడా మొదటి నుంచీ మద్దతిస్తోందని ఆయన చెప్పారు.

అయితే.. వారిని తాను ఒప్పించాల్సి వచ్చిందని మాలిక్ అంగీకరించారు.

తను కోరుకునే జీవిత భాగస్వామి తన లాగా ముస్లిం అయివుండాలని, సరదాగా ఉండే తన కుటుంబానికి తగ్గట్టుగా ఉండాలని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, Variety Marriage : ఒకే జంట.. ఒకే రోజు... మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకంటే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)