'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు

మాన్యవర్ మోహే ప్రకటన

ఫొటో సోర్స్, MANYAWAR MOHEY

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ మధ్య టీవీలో, సోషల్ మీడియాలో రెండు ప్రకటనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఒకటి 'మాన్యవర్ మోహే' ప్రకటన. అందులో నటి ఆలియా భట్ ఒక వధువులా కనిపిస్తుంటారు.

ఇక మరో ప్రకటన క్యాడ్‌బరీ చాక్లెట్‌ది. ఇందులో చెన్నై స్విమ్మర్, నటి కావ్యా రామచంద్రన్ క్రికెటర్ పాత్రలో కనిపిస్తారు.

మొదటి ప్రకటన భారతీయ సమాజంలో కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాలపై ప్రశ్నలు సంధిస్తే, రెండోది లింగవివక్షతో కూడిన ఛాందసవాదాల్ని ధ్వంసం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

'మాన్యవర్ మోహే' బట్టల బ్రాండ్. దీని ప్రకటనలో వధువు పాత్రలో కనిపించే ఆలియా భట్ పెళ్లి పీటలపై కూర్చుని.. ఆచారాలు, సంప్రదాయాల సంకెళ్లలో చిక్కుకుపోయిన అమ్మాయిల మనసుల్లో తలెత్తే ప్రశ్నల గురించి చెబుతుంటారు.

కూతురు పరాయి ఆస్తి ఎందుకు అవుతుంది? అమ్మాయిలనే కన్యాదానం ఎందుకు చేస్తారు? అని ఆలియా అడుగుతారు.

ఈ ప్రకటన చివర్లో వరుడి అమ్మనాన్నలు కూడా తమ కొడుకు చేయి తీసుకుని చేతులు ముందుకు చాపడంతో.. "కొత్త ఐడియా కన్యా మాన్"అంటారు ఆలియా భట్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రకటనలపై స్పందన

ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వస్తున్నాయి.

అనుపమ అనే ట్విటర్ యూజర్ #kanyamaan not #kanyadaan అని రాస్తూ "ఈ ప్రగతిశీల సందేశం సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. కూతుళ్లను మాత్రమే ఎందుకు అలా ఇచ్చేస్తారు?" అని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

@Themohitverma కోపంగా "హిందువుల భావాలకు ఇది విరుద్ధంగా ఉంది. మొదట కన్యాదానం అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. హిందువులు వారి ఆచారాలకు వ్యతిరేకంగా వెళ్లడం మానండి" అని పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో ఇలాగే మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

డాక్టర్ ఏఎల్ శారద
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఏఎల్ శారద

ఈ ప్రకటన ద్వారా ఒక సానుకూల సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించారని బీబీసీతో మాట్లాడిన సామాజిక వేత్త డాక్టర్ ఏఎల్ శారద అన్నారు.

"భారతీయ సమాజంలో కూతురి గురించి పరాయి బిడ్డ, పరాయి ఆస్తి లాంటి మాటలు ఉపయోగిస్తుంటారు. అవి ఏ అమ్మాయికైనా చాలా బాధగా, అవమానకరంగా ఉంటాయి. అదే సమయంలో ఇది తల్లిదండ్రుల ప్రవర్తనను కూడా కూడా ప్రభావితం చేస్తుంది. వారు ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ, వారికి లోలోపల ఎక్కడో కూతురు అంటే ఒక నిర్లిప్తత లేదా భయం లాంటిది ఉంటాయి. అందుకే వారు ఆమెను ఒక బాధ్యతగా భావిస్తారు".

అమ్మాయి గుర్తింపుపై ప్రశ్నలు

మరోవైపు డాక్టర్ అశితా అగ్రవాల్ కూడా మాన్యవర్ ప్రకటన గురించి బీబీసీతో మాట్లాడారు.

"కన్యాదానం అనే కాన్సెప్ట్ ఏంటి? అని ఈ ప్రకటన భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయిన విశ్వాసాలను సవాలు చేస్తోంది. దానం ఇవ్వడానికి మీరు ఆమె కంటే ఎక్కువా, లేక ఆమెకు మీరు యజమానా, దానం అంటే యజమాని ఒక వస్తువును మరొకరికి ఇచ్చేయడం. అంటే మీరు ఈ ఆచారంతో ఆ అమ్మాయి గుర్తింపు తగ్గించేస్తున్నారు" అన్నారు.

తన వివాహంలో తండ్రి కన్యాదానం చేయడానికి వచ్చినపుడు తాను దానికి అంగీకరించలేదని ఆమె చెప్పారు. SPIJMERలో మార్కెటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ అశితా కంజూమర్ ఇన్‌సైట్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేస్తున్నారు.

"ఏదైనా ఒక అంశం జనాల మనసులను గాయపరిచినప్పుడు లేదంటే వారికి గిల్ట్ లేదా తప్పు చేశామనే భావన కలిగినప్పుడు దానిపై ట్రోలింగ్ జరుగుతుంది. వారు ఆ విధంగా తాము చేస్తున్నది సమర్థించుకోవాలని అనుకుంటారు" అని ఆమె చెప్పారు.

డాక్టర్ అశితా అగ్రవాల్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ అశితా అగ్రవాల్

లింక్డిన్‌లో ఆమె ఈ రెండు ప్రకటనల గురించి రాసినపుడు, చాలా మంది బాగా చదువుకున్న వాళ్లు కూడా 'మాన్యవర్ మోహే' ప్రకటనను మహిళల భద్రతకు ముడిపెట్టారు.

"వారంతా కన్యాదానం అంటే ఒక తండ్రి తన కూతురి రక్షణను ఇంకొకరి చేతికి అప్పగిస్తున్నారు అన్నారు. కానీ, ఇక్కడ భద్రత అంటే అర్థం ఏంటి. మహిళలు తమకు తాము ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. సమాజంలో కూడా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మహిళలు ఇప్పుడు కూడా తమ పిల్లలు, కుటుంబం బాధ్యత తీసుకుంటున్నారు. కానీ మీరు మాత్రం మహిళలను తక్కువ చేసి చూపుతున్నారు" అంటారు అశిత.

పీఎన్ వాసంతి
ఫొటో క్యాప్షన్, పీఎన్ వాసంతి

మహిళల పాత్ర మారింది

"ప్రకటనల ప్రపంచం చాలా ముందుకెళ్లిపోయింది. అందులో మహిళల పాత్ర కూడా మారింది" అని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్‌సీఐ) కంజూమర్ కన్సల్టెంట్ కౌన్సిల్(సీసీసీ) సభ్యురాలు పీఎన్ వాసంతి అన్నారు.

"ఒకప్పుడు మహిళలను ఒక వస్తువులా చూపించేవారు. అంటే పెన్ లేదా టైర్ల ప్రకటన అయినా అక్కడ ఒక అందమైన అమ్మాయిని అర్ధనగ్నంగా చూపించేవాళ్లు. కానీ, అది కాలంతోపాటూ మారింది" అని ఆమె అన్నారు.

ఇటీవల భారత ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ఒక ప్రకటన విడుదలైంది. అందులో రకరకాల సమాజాల్లో వధూవరులను చూపిస్తారు. అందులో ఒక ముస్లిం కుటుంబం హిందూ కోడలుకు సీమంతం చేయడాన్ని కూడా చూపించారు. అది చాలా వివాదాస్పదం అవడంతో తర్వాత దానిని తొలగించాల్సి వచ్చింది.

మరోవైపు వేరే బ్రాండ్ల ప్రకటనలు ఉన్నాయి. అవి ఒక విధంగా భారతీయ కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే హక్కు తండ్రి, భర్త, సోదరుడికే ఉంటుందని, వారే ఇంటికి పెద్ద అని చెప్పేవాటిని ధిక్కరించినట్లు కనిపిస్తాయి.

తనిష్క్ ప్రకటన

ఫొటో సోర్స్, Tanishq

ప్రకటనల వెనుక ఆలోచన

వీటిలో సభ్యత బ్రాండ్ ప్రకటన ఒకటుంది. అందులో అత్తగారు తన కోడలితోపాటూ తన కొడుకుతో కూడా ఇంట్లో పనులు చేయిస్తారు.

గత పది, పన్నెండేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రకటనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఆందోళనకరమైనవి, పరిణామం చెందినవి అంటారు డాక్టర్ అశితా అగ్రవాల్. ప్రకటనల్లో మహిళల గుర్తింపు గురించి చెబుతున్నారని అన్నారు. దానికి కాడ్‌బరీ ప్రకటనను ఉదాహరణగా చెప్పిన ఆమె దానిని పరిణామం చెందిన ప్రకటనల కేటగిరీలో పెట్టారు.

కాడ్‌బరీ తాజా ప్రకటన నిజానికి 27 ఏళ్ల క్రితం వచ్చిన అదే చాక్లెట్ ప్రకటనకు రివర్సల్ లేదా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రకటన ఎన్నో ప్రశంసలను అందుకుంటోంది. చాలా మంది ఇది తమ పాత జ్ఞాపకాలకు ప్రాణం పోసిందని చెబుతున్నారు.

ఇది ఒక సానుకూల మనస్తత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఒక యువతి క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొట్టగానే, ఆమె విజయాన్ని ఒక యువకుడు ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్‌గా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటివి సాధారణంగా కనిపించవు. దానికి బదులు ఒక మహిళ విజయంపై అసూయ లేదా చిన్నచూపు ఉంటుంది. ఈ క్యాడ్‌బరీ ప్రకటన #GoodLuckGirls అనే మాటతో ముగుస్తుంది.

"ఒక అమ్మాయి బహిరంగంగా ఫీల్డులోకి వచ్చి సంతోషంగా డాన్స్ చేయగలదు, తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలదు అనేది 1994లో కూడా ఊహించుకోలేకపోయారు" అని పద్మశ్రీ పురస్కారం పొందిన ఓగిల్వీ ఏజెన్సీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్(వరల్డ్ వైడ్) పీయూష్ పాండే అన్నారు.

"ఇక్కడ మా ఉద్దేశం అబ్బాయిలను కొత్త పాత్రలో చూపించాలని కాదు. అమ్మాయిలు ఎంత పురోగతి సాధిస్తున్నారో చెప్పి, వారికి సెల్యూట్ చేయడం, వారిని ప్రోత్సహించడమే. ఇక #GoodLuckGirls అనే మాటతో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న అమ్మాయిలందరినీ, మీరు మరింత బాగా చేయాలి అని ప్రోత్సహించాలని అనుకున్నాం. కానీ, దానికి టైమింగ్ బోనస్ అయ్యింది. నేను ఈ ప్రకటనకు చాలా లైఫ్ చూస్తున్నాను" అని ఆయన చెప్పారు.

2022లో విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతోంది. కాడ్‌బరీ తన ప్రకటనతో మహిళా క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నట్లు, గత కొన్నేళ్లుగా వారి అద్భుతమైన ప్రదర్శనను చూపించాలనుకున్నట్లు అనిపిస్తోంది. ఈ ప్రకటన ఒలింపిక్స్‌లో అమ్మాయిల అద్భుత ప్రదర్శనను కూడా గుర్తు చేస్తుంది.

కాడ్‌బరీ చాక్లెట్ ప్రకటన

ఫొటో సోర్స్, CADBURY

తమ క్యాడ్‌బరీస్ ప్రకటన గురించి పీయూష్ పాండే మరింత వివరంగా చెప్పారు.

"ఏదైనా ఐకానిక్ అయిన దానిని టచ్ చేయాలంటే ఎవరైనా భయపడతాడు. కానీ, మేం దానిని రివర్స్ చేశాం. ఎందుకంటే ఆ ప్రకటనకు ఒక సంస్కృతి ఉంది. అది అన్ని వయసుల వారికీ నచ్చుతోంది. ఇప్పుడు, అమ్మాయిలు అంత బాగా ఆడుతున్నప్పుడు, ఆ రోల్ రివర్స్ ఎందుకు చేయకూడదు. అది మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తుంది" అన్నారు.

మహిళలు తమ లక్ష్యాలను అందుకుంటున్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది సామాజిక కట్టుబాట్ల వల్ల తాము అనుకున్నవన్నీ సాధించలేకపోతున్నారు. పురుషులు తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం కూడా తక్కువగానే కనిపిస్తోంది. అలాంటి సమయంలో ఈ ప్రకటన ఇంతకు ముందు కనిపించని ఎన్నో సంకెళ్లను తెంచేసినట్లు కనిపిస్తోంది.

కానీ, ఇలాంటి ప్రకటనలు సమాజంపై ఎంత ప్రభావం చూపుతాయి. ఇవి మహిళలకు సాధికారతను అందిస్తాయా.

దీనిపై మాట్లాడిన నిపుణులు మాత్రం "ఇలాంటి ప్రకటనలు ఇప్పటి తరాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ ఇలాంటి అంశాలపై స్కూళ్లు, యూనివర్సిటీలు, ఇంట్లో కూడా చర్చ మొదలుపెట్టాల్సి ఉంటుంది" అంటున్నారు.

"చిన్న నగరాలు లేదా పట్టణాల్లో మగాళ్ల రక్షణలోనే తమకు భద్రత ఉందని మహిళలు ఇప్పటికీ భావిస్తున్నారు, కానీ, నగరాల్లో ఈ ఆలోచన మార్చడానికి పదేళ్లు పడితే, పట్టణాలు, పల్లెల్లో దానిని మార్చడానికి రెండు దశాబ్దాలు పడుతుంది. కానీ, ఆ తర్వాత తరం మాత్రం కచ్చితంగా మార్పు చూస్తుంది" అంటారు డాక్టర్ అశితా అగ్రవాల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)