ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అబార్షన్లు... ప్రమాదంలో మహిళల ప్రాణాలు

ఇలస్ట్రేషన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల మంది మహిళలు అబార్షన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో 45 శాతం అబార్షన్లు ప్రమాదకరంగా మారతున్నాయి.

భారత్‌లాంటి దేశాల్లో అయితే సగం అబార్షన్లు ప్రమాదకరమే. అబార్షన్ చట్టంపై అవగాహన లేకపోవడంతో అవి మరిన్ని సమస్యలను తీసుకొస్తున్నాయి.

సాధారణంగా పెళ్లికాని యువతులు అబార్షన్ గురించి వైద్యులను సంప్రదించడానికి వెనకాడుతారు. అందుకే, భారత్‌లో అబార్షన్ చట్టాల్లో మార్పు తేవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి.

పార్లమెంటులో దీనిపై సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు.

వీడియో క్యాప్షన్, ఏటా 5.6 కోట్ల అబార్షన్లు... కారణాలేంటి

ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం... పెళ్లయినా, కాకపోయినా మహిళలు అబార్షన్‌ను ఆశ్రయించొచ్చు. మహిళల వ్యక్తిగత గోప్యతకు కూడా ఈ బిల్లు ప్రాధాన్యమిస్తుంది.

వైద్యులు మహిళలను అనుచిత ప్రశ్నలు అడగడానికి కూడా వీల్లేదు. 18ఏళ్లు దాటిన మహిళలు ఎవరి అనుమతీ తీసుకునే అవసరం లేదు.

గర్భం దాల్చిన 12-20 వారాల లోపు అబార్షన్ చేయించుకోవడం భారత్‌లో చట్టబద్ధమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)