పాకిస్తాన్‌: భారీ హిమపాతం, కార్లలో చిక్కుకుపోయి 21 మంది పర్యాటకుల మృతి

మంచులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు మిలటరీ సహాయ కార్యక్రమాలను చేపడుతోంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మంచులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు మిలటరీ సహాయ కార్యక్రమాలను చేపడుతోంది

పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మర్రీలో భారీ హిమపాతం కారణంగా కనీసం 21 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. పంజాబ్ ప్రావిన్సులోని మర్రీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

భారీగా మంచు కురవడంతో తమ కార్లలోనే చిక్కుకుపోయిన 21 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారు.

సహాయ కార్యక్రమాలను చేపడుతోన్న మిలటరీ, కార్లలో చిక్కుకుపోయిన మిగతా వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. రోడ్లను క్లియర్ చేస్తోంది.

మంచు తుపాను కారణంగా దాదాపు 1,000 వాహనాలు హైవేపై చిక్కుకుపోయాయని హోం మంత్రి షేక్ రషీద్ పేర్కొన్నారు.

మర్రీ అనేది ఇస్లామాబాద్‌కు ఉత్తరాన ఉన్న మౌంటెన్ రిసార్ట్ ప్రాంతం. మంచు కారణంగా పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారని స్థానిక మీడియా వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, భారీగా కురుస్తున్న మంచు

అసాధారణంగా కురిసే భారీ హిమపాతాన్ని చూడటానికి లక్షకు పైగా కార్లలో పర్యాటకులు మర్రీ ప్రాంతానికి వచ్చారు. ఈ కారణంగానే మర్రీ లోపలికి వెళ్లే, బయటకు వచ్చే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

విపరీతమైన మంచు కారణంగా కార్లలోనే గడ్డకట్టిపోయి ఆరుగురు మరణించారని, మిగతా వారు ఎలా చనిపోయారో ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఊపిరాడకపోవడం కూడా వీరి మరణానికి ఒక కారణమయ్యే అవకాశముందని అన్నారు.

ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని 'డిజాస్టర్ ఏరియా'గా ప్రకటించి, ప్రజలను దీనికి దూరంగా ఉండాలని పోలీసులు కోరారు.

''ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు'' అని మర్రీ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకుడు ఉస్మాన్ అబ్బాసీ, వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో ఫోన్‌లో చెప్పారు.

''టూరిస్టులే కాకుండా స్థానిక ప్రజలు కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గ్యాస్, నీటి కొరత ఉంది'' అని చెప్పారు.

భారీ హిమపాతం

ఫొటో సోర్స్, UMAIR ABBASI

''గత 15 - 20 ఏళ్లలో మొదటిసారిగా ఇప్పుడే ఇంత పెద్ద సంఖ్యలో పర్యాటకులు మర్రీకి తరలి వచ్చారు. దీని వల్లే ఈ ప్రమాదం సంభవించింది'' అని వీడియో సందేశంలో రషీద్ తెలిపారు.

పర్యాటకుల మృతి పట్ల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ఇలాంటి విషాదాలను నివారించడానికి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై విచారణకు ఆదేశించాను'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)