కశ్మీర్‌‌పై మంచు దుప్పటి

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌‌పై మంచు దుప్పటి

హిమపాతానికి కశ్మీర్ గజగజలాడుతోంది. ఆ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోవడంతో కశ్మీర్ గడ్డకట్టుకుపోయినట్లు ఉంది.

హిమపాతంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంచు కురుస్తుండటంతో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే, హిమపాతం చూటడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు.

ఏటా ఇక్కడ 40 రోజులపాటు గడ్డకట్టించే చలి ఉంటుంది. దీన్నే స్థానికులు 'చిల్లయ్ కలాన్' అంటారు. ఈసారి పొడి చలికాలం ఉంటుందని నిపుణులు చెప్పారు. కానీ, హిమపాతంతో వారి అంచనాలు తప్పాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)