అరుణిమా సిన్హా: ఎవరెస్టు, విన్సన్ శిఖరాలపై కాలుమోపిన తొలి వికలాంగురాలు

ఫొటో సోర్స్, NARENDRAMODI/tWITTER
- రచయిత, మీనా కోట్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోని ఏడు అతిపెద్ద పర్వత శిఖరాలను అధిరోహించిన తొలి వికలాంగురాలు - అరుణిమా సిన్హా. ఈ మధ్యే ఈమె అంటార్క్‌టికాలోని అతిపెద్ద మంచు పర్వత శిఖరమైన విన్సన్ మాసిఫ్ పైకి విజయవంతంగా చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
పట్టుదల ముందు వైకల్యం అడ్డురాదని నిరూపించిన అరుణిమకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయం భారత్‌కు ఎంతో గర్వకారణమని కొనియాడారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అరుణిమ చెప్పారు.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, ఎవరెస్టుతో పాటు ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏడు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించారు అరుణిమ. ప్రపంచంలో ఇంతటి ఘనత సాధించిన తొలి వికలాంగురాలు ఈమెనే.
"పర్వతారోహణను పురుషుల క్రీడగా చాలామంది భావిస్తారు. అందుకే, మహిళలు ఇందులోకి రావాలనుకుంటే ఎవరూ ప్రోత్సహించరు. పైగా వికలాంగురాలైతే మరీ కష్టం. ప్రజల్లో ఉండే ఈ మనస్తత్వం ఒక మైండ్ బ్రేక్ లాంటిది. అయితే నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాతే ఈ మైండ్ బ్రేక్ బద్దలైంది." అని అరుణిమ అంటున్నారు.

ఫొటో సోర్స్, sinha_arunima/tWITTER
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్‌లో పుట్టి పెరిగిన అరుణిమ.. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
2011లో ఆమె ఒక కాలు కోల్పోయారు. అయినా, వైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదని ఆమె నిరూపించారు.
"2011లో జరిగిన ఒక దుస్సంఘటనలో నన్ను నడుస్తున్న రైలులోంచి కొందరు వ్యక్తులు బయటకు తోసేశారు. ఏడు గంటలపాటు రైలు పట్టాల మీదే పడి ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అసలు పోరాటం.. నేను ఎయిమ్స్‌లో ఉన్న సమయంలోనే మొదలైంది. నేను ఆత్మహత్య చేసుకునేందుకే రైలులోంచి దూకాననీ, నా వద్ద టికెట్ లేదనీ.. ఇలా నా గురించి రకరకాల పుకార్లు వ్యాపింపజేశారు. మహిళగా నా పట్ల సానుభూతి చూపడానికి బదులు నన్ను వివాదంలోకి లాగడంతో చాలా బాధపడ్డా" అని అరుణిమ గుర్తు చేసుకున్నారు.
అయినప్పటికీ ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. దేశవ్యాప్తంగా ఎందరికో ప్రేరణగా నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజుపూర్ గ్రామానికి చెందిన అబ్బాయితో అరుణిమకు వివాహమైంది. ఆమె వల్ల ఆ గ్రామానికి కూడా ఇప్పుడు గుర్తింపు వచ్చింది.
అరుణిమ తామందరికీ ప్రేరణగా నిలిచిందని గ్రామస్థులు కొనియాడుతున్నారు.
అయితే, తానీ లక్ష్యాన్ని చేరుకోగలగడానికి భర్త తోడ్పాటే కారణమని అరుణిమ అంటారు.
"పెళ్లి కానుకలుగా మా ఆయనను పర్వతారోహణకు కావాల్సిన రకరకాల వస్తువులు ఇవ్వాలని కోరాను. నా విజయం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మహాకూటమి కోల్‌కతా ర్యాలీ: ఈ బంధం ఏం చెబుతోంది
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- 'ఫిమేల్ వయాగ్రా'ను అనుమతించిన తొలి అరబ్ దేశం ఈజిప్టు
- 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో బీసీ కోటా ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేరు
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నోళ్లు ‘100 ఏళ్లు బతుకుతున్నారు’
- కఠువా గ్యాంగ్‌రేప్ కేసు: ఏడాదైనా న్యాయం దొరకలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








