మీ పిల్లలకు టేబుల్స్ సులభంగా నేర్పించాలనుకుంటున్నారా.. ఈ పద్ధతి పాటించండి

గణితం

గుణకారం చేయడం రావడం లేదా..? పెద్ద సంఖ్యలను గుణించాలంటే కాలిక్యులేటర్ వైపు చూస్తున్నారా.. అయితే మీ పిల్లలకు గుణకారం నేర్పించడానికి, ఎక్కాలు(టేబుల్స్) నేర్పించడానికి ఈ సులభ పద్ధతిని అనుసరించండి.

అడ్డ గీతలు, నిలువు గీతలు వస్తే చాలు ఎంతపెద్ద గుణకారమైన ఇట్టే చేసేయొచ్చు.

భారత్‌లో ఆవిర్భవించిన ఈ గుణకార పద్ధతి మొదట చైనాకు వెళ్లింది. అక్కడి నుంచి అరబ్ దేశాలకు పాకింది.

15వ శతాబ్దం నాటికి ఇటలీకి చేరింది. అక్కడ ఈ పద్ధతిని జెలోసియాగా పిలుస్తారు.

వీడియో క్యాప్షన్, ఎక్కాలు రావడం లేదా... ఈ పద్ధతిలో సులువుగా చేసేయండి

ఈ పద్ధతిలో ఏం చేయాలంటే.

మొదట రెండు సంఖ్యలను తీసుకోవాలి. వాటిని గుణించడానికి ముందు ఒక చతురస్రం గీయాలి. అందులో మళ్లీ నాలుగు చతురస్రాలు గీయాలి. వాటి లోపల కర్ణాలు వేయాలి.

ఇప్పుడు రెండు సంఖ్యల్లోని మొదటి అంకెలను గుణించాలి. వాటి మొత్తాన్ని కర్ణాలలో వేయాలి. ఇలా ప్రతి అంకెకు చేయాలి.

చివరగా కర్ణాల మధ్యనున్న అంకెల మొత్తాన్ని కూడాలి. అప్పుడు ఫలితం వస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)