కాబుల్‌లో పాక్ వ్యతిరేక ర్యాలీలు.. 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' అంటూ నినాదాలు.. గాల్లోకి తాలిబాన్ల కాల్పులు

కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

ఫొటో సోర్స్, TOLO NEWS

ఫొటో క్యాప్షన్, కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ప్రస్తుతం నగర వీధుల్లో నిరసనకారుల కవాతు జరుగుతోంది.

ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న అఫ్గాన్ మహిళలు, యువకులు హక్కులను డిమాండ్ చేయడంతో పాటు, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.

నిరసనకారులు 'అల్లాహు అక్బర్', 'మాకు స్వయం పాలిత దేశం కావాలి', 'మాకు పాకిస్తాన్‌ తోలుబొమ్మ ప్రభుత్వం వద్దు', 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' వంటి నినాదాలు చేశారని కాబుల్‌లోని బీబీసీ ప్రతినిధి ముదాసర్ మాలిక్ తెలిపారు.

కాబుల్ వీధుల్లో గాలిలోకి కాల్పులు జరుపుతున్న తాలిబాన్లు

నిరసనకారులు అధ్యక్ష భవనం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబాన్లు ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం కాబూల్‌లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి మంది పురుషులు, మహిళలు అక్కడ గుమిగూడారు. వారు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పంజ్‌షీర్‌లో పాకిస్తాన్ తాలిబాన్లకు మద్దతు ఇచ్చిందన్నారు. కొంతమంది ప్రదర్శనకారులు ఐఎస్ఐ చీఫ్ కాబుల్ సందర్శన గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. కొందరు మహిళల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నిరసనలు జరుగుతున్న ప్రదేశంలో తాలిబాన్లు కూడా ఉన్నారు.''

కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

'ఉమ్మడి జాతీయ తిరుగుబాటు చేయాలి'

సోమవారం రాత్రి కాబుల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోల్లో, నిరసనకారులు చేసిన 'నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ జిందా రహో' నినాదాలతో పాటు పాకిస్తాన్ వ్యతిరేక స్లోగన్లు వినవచ్చు.

నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గాన్(ఎన్ఆర్ఎఫ్) నాయకుడు అహ్మద్ మసూద్ సోమవారం ఆడియో సందేశాన్ని పంపారు. అఫ్గానిస్తాన్ అంతటా తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉమ్మడి జాతీయ తిరుగుబాటుకు పూనుకోవాలని అఫ్గాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ తిరుగుబాటుకు కాబుల్, మజార్-ఎ-షరీఫ్‌లో మహిళల నిరసనలు ఒక ఉదాహరణ అని మసూద్ పేర్కొన్నారు.

అఫ్గానిస్తాన్ బయట కూడా తాలిబాన్ వ్యతిరేక ప్రదర్శనలను ఆయన ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

గతకొన్ని రోజులుగా కాబుల్‌లో అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి.

అఫ్గాన్ జెండాను తొలగించడాన్ని కొందరు నిరసించగా, వివిధ నగరాల్లో మహిళలు తమ హక్కుల కోసం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

సోమవారం, బల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఎ-షరీఫ్‌లో మహిళల బృందం తమ హక్కులు, స్వేచ్ఛను కోరుతూ ర్యాలీ నిర్వహించింది.

బల్ఖ్ లోని ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వంలోని అఫ్గాన్ మహిళల హక్కులను తాలిబాన్లు కాపాడాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినా తాలిబాన్ సభ్యులు తనను, ఇతర జర్నలిస్టులను చంపేస్తామని బెదిరించారని ఒకరు బీబీసీ పెర్షియన్‌కు తెలిపారు.

కాబుల్ వీధుల్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసన

ఐఎస్ఐ చీఫ్ కాబుల్ పర్యటన

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ కాబుల్‌‌ను సందర్శించడంపై ఆందోళకారులు మంగళవారం మండిపడ్డారు.

అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతుండగా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ శనివారం కాబుల్ వెళ్లారు.

భవిష్యత్ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హమీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం అఫ్గాన్ వచ్చిందని పాకిస్తాన్ 'అబ్జర్వర్' వార్తాపత్రికను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఐఎస్ఐ చీఫ్, తాలిబాన్ కమాండర్లు, ఇతర నాయకులతో సమావేశమయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటుకు మరింత సమయం

తాలిబాన్లకు సైనిక సహాయం అందిస్తోందని పాకిస్తాన్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని పాకిస్తాన్ ఖండిస్తూ వచ్చింది.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఐఎస్ఐ చీఫ్ కాబూల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు తేదీని పొడగిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం పడుతుందని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.

(కాపీ - విభురాజ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)