జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ట్యాంక్‌ను ఇంట్లో దాచిపెట్టాడు

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పాంథర్ ట్యాంక్

ఫొటో సోర్స్, Carsten Rehder/DPA

ఫొటో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పాంథర్ ట్యాంక్

84 ఏళ్ల ఆ వృద్ధుడికి 14 నెలల జైలు శిక్షతో పాటు 250,000 యూరోల (దాదాపు 2.19 కోట్ల రూపాయలు) జరిమానా విధించారు.

హైకెన్‌డార్ఫ్‌లోని ఆ వృద్ధుని ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ట్యాంకుతో పాటు ఇతర యుద్ధ సామగ్రిని అధికారులు 2015లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి తరలించడానికి సైన్యం సహాయం తీసుకోవాల్సి వచ్చింది.

జర్మనీ ప్రైవసీ చట్టాల ప్రకారం కోర్టు దోషి పేరు వెల్లడి చేయలేదు. ఆ ట్యాంకును, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యానన్‌ను రెండేళ్లలోగా అమ్మడమో, మ్యూజియంకు విరాళంగా ఇవ్వడమో చేయాలని కోర్టు సోమవారం నాడు ఆదేశించింది.

నిందితుడి తరఫు న్యాయవాది చెప్పిన ప్రకారం ఆ 'పాంథర్ ట్యాంక్'ను కొనడానికి అమెరికాలోని ఒక మ్యూజియం ఆసక్తి చూపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన ఆ ట్యాంక్ అత్యంత సమర్థమైనదని అమెరికా చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ ట్యాంకుతో పాటు పిస్టల్స్, రైఫిల్స్ కూడా తీసుకోవడానికి జర్మన్ సేకర్తలు కూడా ముందుకు వచ్చినట్లు లాయర్ చెప్పారని స్థానిక పత్రికలు తెలిపాయి.

ఆ వృద్ధుడి ఇంటి మీద గతంలో నాజీల కాలం నాటి కళారూపాల కోసం అధికారులు దాడి చేశారు. అక్కడ ఆయుధ సామగ్రి కూడా ఉందని సమాచారం అందడంతో స్థానిక అధికారులు 2015లో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఆ ఇంట్లోంచి పాంథర్ ట్యాంకును తరలించడానికి 20 మంది సైనికులు దాదాపు 9 గంటలు కష్టపడాల్సి వచ్చింది.

ఆ వృద్ధుడు గతంలో ఒకసారి చలికాలంలో మంచును తొలగించేందుకు ఆ ట్యాంకర్ ఉపయోగిస్తూ కనిపించారని స్థానికులు చెప్పినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.జర్మనీలోని ఓ వృద్ధుడికి అక్రమంగా ఆయుధాలు నిల్వ చేసిన నేరానికి శిక్ష పడింది. ఆయన వద్ద వ్యక్తిగతంగా ఉపయోగించే తుపాకులు వంటి యుద్ధ సామగ్రితో పాటు ఓ ట్యాంక్ కూడా దొరికింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)