టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌కు చేరిన పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ షట్లర్‌పై విజయం

ఫొటో సోర్స్, Reuters
టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న పీవీ సింధు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగూచిని ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు.
ఈ మ్యాచ్‌లో సింధు తన ప్రత్యర్థిపై మొదటి నుంచీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి గేమ్‌ను సింధు 21-13 స్కోర్‌తో గెలిచారు. రెండో గేమ్‌ను 22-20 తేడాతో సొంతం చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో యమగూచిని సింధు మొదటి నుంచీ ఒత్తిడిలోకి నెట్టారు. తనదైన శైలిలో స్మాషెస్ కొడుతూ మ్యాచ్ మీద పట్టు సంపాదించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
యమగూచితో సింధు ఆడిన 19వ మ్యాచ్ ఇది. ఈ జపాన్ క్రీడాకారిణిపై సింధు ఇప్పటివరకు 12 సార్లు విజయం సాధించారు. మొదటి గేమ్‌ను 21-13 స్కోర్‌తో గెలిచిన సింధుకు, రెండో గేమ్ అంత సులభంగా దక్కలేదు. రెండో గేమ్‌లో సింధుకు యమగూచి గట్టి పోటీనిచ్చారు. ఒక దశలో 15-15 స్కోర్‌త సమాన స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు షట్లర్లు ఆ తరువాత ఒక్కో పాయింట్‌కు చాలా కష్టపడాల్సి వచ్చింది.
చివరికి సింధు రెండు వరస పాయింట్లు సాధించి 22-20 స్కోర్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.
గురువారం నాడు జరిగిన మ్యాచ్‌లో సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 స్కోర్‌తో ఓడించారు.
ఈ మ్యాచ్‌లో కూడా సింధు మొదటి నుంచి ఆధిక్యం కనబరిచారు.
టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తారని భావిస్తున్న సింధు అంతకు ముందు బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా చక్కని ప్రతిభ కనబరిచారు. హాంకాంగ్‌కు చెందిన చోంగ్ నంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు విజయం సాధించారు.

ఫొటో సోర్స్, MARTIN BUREAU/AFP via Getty Images
ఐర్లాండ్‌పై భారత మహిళల హాకీ జట్టు విజయం
టోక్యో ఒలింపిక్ మహిళల హాకీ పూల్ ఏ మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది.
చివరి క్షణాల్లో గోల్ చేసిన భారత మహిళా హాకీ జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. భారత్ తన తర్వాత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఫొటో సోర్స్, MARTIN BUREAU/AFP via Getty Images
ఒక్క గోల్ తేడాతో గెలిచిన భారత్
భారత్ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక గోల్ చేసింది. 57వ నిమిషంలో నవనీత్ కౌర్ ఈ గోల్ చేశారు.
భారత్ ఈ మ్యాచ్‌లో మెరుగైన విజయం సాధించే అవకాశం కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో భారత్‌కు 14 పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ అన్నింటినీ గోల్స్‌గా మలచడంలో జట్టు విఫలమైంది.
అయితే, ఈ విజయంతో భారత మహిళా హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకోడానికి మార్గం సుగమమైంది.
పురుషుల హాకీ గెలుపు
పురుషుల హాకీ పూల్-ఏ గ్రూపులో శుక్రవారం నాడు భారత జట్టు జపాన్ మీద విజయం సాధించింది. 5-3 గోల్స్ తేడాతో భారత జట్టు ఈ విజయాన్ని నమోదు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆర్చర్ దీపికకు నిరాశ
మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టిన భారత ఆర్చర్ దీపికా కుమారి దక్షిణ కొరియా ఆర్చర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
దక్షిణ కొరియా ఆర్చర్ ఆన్ శాన్ దీపికా కుమారిపై వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 6-0తో విజయం సాధించారు. దీంతో దీపిక పతకం ఆశలకు తెరపడింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు పతకం ఖాయం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్
భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్‌లో తన పతకం ఖాయం చేసుకున్నారు.
లవ్లీనా 69 కిలోల విభాగంలో చైనా తైపీ బాక్సర్‌ను ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్నారు.
లవ్లీనా బోర్గోహెయిన్ 4-1 తేడాతో చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నిన్-చిన్ మీద 4-1 తేడాతో గెలిచారు.
దీంతో టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు మరో మెడల్ రావడం ఖాయమైంది.
బాక్సింగ్ వెల్టర్ వెయిట్ విభాగంలో లవ్లీనా భారత్‌కు కనీసం కాంస్య పతకం తీసుకురానున్నారు.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images
ఎవరి చేతిలో ఓడిందో ఆమెపైనే గెలిచింది
క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఓడించిన చైనా తైపీ బాక్సర్ చెన్ నిన్-చిన్ మాజీ వరల్డ్ చాంపియన్.
ఇంతకు ముందు ఎన్నో పోటీల్లో ఆమె లవ్లీనాను ఓడించారు.
లవ్లీనా 2018లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా నియెన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అస్సాం ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
అస్సాం బాక్సర్ లవ్లీనా సెమీ-ఫైనల్ చేరినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఇది ఒక పెద్ద పంచ్. మీరు మమ్మల్ని నిరంతరం గర్వపడేలా చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆర్చర్ దీపికాకుమారి
ఒలింపిక్ క్రీడల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి పతకం దిశగా మరో అడుగు వేశారు.
1/8 ఎలిమినేషన్ రౌండ్‌లో రష్యా ఒలింపిక్ కమిటీ క్రీడాకారిణి క్సీనియా పెరోవాపై దీపికా కుమారి 6-5 సెట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ విజయంతో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇది శుక్రవారం ఉదయం 11.30కు జరగనుంది.
మొదటి నుంచీ పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ ఐదు ఐదు సెట్లతో సమంగా నిలవగా చివరికి షూటవుట్‌లో 10 పాయింట్లు సాధించిన దీపిక చివరి సెట్ గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, KEVIN C. COX
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్: నిరాశపరిచిన మను భాకర్
షూటింగ్‌లో శుక్రవారం భారత క్రీడాకారులకు మరోసారి నిరాశ ఎదురైంది.
25 మీటర్ల పిస్టల్ షూటింగ్ రాపిడ్ రౌండ్‌లో భారత షూటర్లు మను భాకర్, రాహీ సర్‌నోబత్ నిరాశపరిచారు.
మను భాకర్ మొత్తం 582 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరడానికి కనీసం 8వ స్థానంలో నిలవాల్సి ఉంటుంది.
మరోవైపు సర్‌నోబత్ 573 పాయింట్లతో 32 స్థానంలో నిలిచారు.
ఓడినా రికార్డు సృష్టించిన భారత అథ్లెట్
టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ రౌండ్-1 హీట్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఏడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు స్థానం పొందలేకపోయినా, భారత్ తరఫున సరికొత్త రికార్డు సృష్టించాడు.
3000 మీ. స్టీపుల్‌చేస్‌లో జాతీయ స్థాయిలో తన పేరిట ఉన్న 8:20:20 సెకన్ల రికార్డును, 8:18.12 సెకన్లతో అధిగమించాడు.అవినాశ్ సాబ్లే గత మార్చిలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో 8:20.20 సెకన్లలో 3000 మీ. స్టీపుల్ చేజ్‌ను పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పాడు.శుక్రవారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ రౌండ్-1 హీట్‌లో కెన్యాకు చెందిన కిబివోట్ 8:12.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తొలిస్థానంలో నిలిచాడు.
ఇథియోఫియాకు చెందిన వేల్ రెండో స్థానం, ఇటలీకి చెందిన అబ్దెల్‌వాహెద్ మూడోస్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








