టోక్యో ఒలింపిక్స్: భారత్ హాకీ జట్టుకు తొలి విజయం, 7వ స్థానంలో షూటర్ సౌరభ్

మీరాబాయి చాను

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ రజత పతకం గెలుచుకున్నారు.

49 కేజీల విభాగంలో చైనాకు చెందిన ఝీహు హూ స్వర్ణ పతకం గెలుచుకోగా.. మీరాబాయి రెండో స్థానంలో నిలిచారు.

స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే, 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లోని మీరాబాయి పతకం సాధిస్తారని అంతా ఆశించారు. అయితే, ఆనాడు మీరాబాయికి నిరాశే ఎదురైంది.

సౌరభ్ చౌధరి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌరభ్ చౌధరి

సౌరభ్ చౌధరికి నిరాశ

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ ఈవెంట్‌ క్వాలిఫయింగ్ రౌండ్‌లో సౌరభ్ 586 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచారు. కానీ, ఫైనల్‌లో అదే స్థాయి ప్రతిభను కనబరచలేకపోయాడు.

19 ఏళ్ల సౌరభ్ చివరకు 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన కనుక పతకం సాధించి ఉంటే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన అయిదవ భారతీయ షూటర్‌గా నిలిచేవాడు.

ఫైనల్స్ ముగిసిన తరువాత సౌరభ్ విలేఖరులతో మాట్లాడుతూ తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పారు.

భారత జట్టు శుభారంభం

భారత హాకీ జట్టు కూడా శుభారంభం చేసింది. మరోవైపు ఆర్చర్లు దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్‌ల జట్టు ఆధిక్యం కనబరుస్తోంది. క్వాలిఫైంగ్ రౌండ్‌లో షూటర్ సౌరభ్ చౌధరి మంచి ప్రదర్శన ఇచ్చారు.

హాకీ జట్టుతో భారత్‌ ఖాతాలో తొలి విజయం నమోదైంది. మెన్స్ పూల్ ఏ విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై 3-2 తేడాతో భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది.

భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు హవా కొనసాగేది. అప్పట్లో పురుషుల హాకీ జట్టు ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించింది. అయితే, 1980ల తర్వాత అనుకున్న స్థాయిలో భారత హాకీ జట్టు ప్రదర్శన ఇవ్వలేదు.

మరోవైపు ఆర్చరీలో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్‌ల మిక్సిడ్ టీమ్ క్వాటర్ ఫైనల్స్‌ తొలి దశలో చైనాకు చెందిన తైపీ జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ తుది దశ కూడా నేడే నిర్వహిస్తారు.

వెయిట్ లిఫ్టింగ్, టెన్సిస్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్‌ పోటీల్లోనూ నేడు భారత క్రీడాకారులు పాల్గొనబోతున్నారు.

అనస్టాసియా, యాంగ్ కియాన్, నైనా క్రిస్టెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనస్టాసియా, యాంగ్ కియాన్, నైనా క్రిస్టెన్

చైనాకు తొలి స్వర్ణ పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకం చైనా గెల్చుకుంది. రష్యా, స్విట్జర్లాండ్‌లకు గట్టి పోటీ ఇచ్చి చైనా ఈ పతకాన్ని గెలుచుకుంది.

మహిళల పది మీటర్లు, ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చైనాకు చెందిన 21ఏళ్ల యాంగ్ కియాన్ టోక్యో ఒలింపిక్స్ తొలి పతకాన్ని దక్కించుకున్నారు.

ఫైనల్స్‌లో ఆమెకు 251.8 స్కోర్ వచ్చింది. ఆమెకు అనస్టాసియా (రష్యా, 251.1), నైనా క్రిస్టెన్ (స్విట్జర్లాండ్, 230.6) నుంచి గట్టి పోటీ ఎదురైంది.

భారత్‌కు చెందిన ఇలవెనిల్ వలరివన్‌కు నిరాశ ఎదురైంది.

జులై 23న జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఒలింపిక్స్ ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)