దక్షిణాఫ్రికా: ఒకే కాన్పులో 10 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

ఫొటో సోర్స్, African News Agency (ANA)
దక్షిణ ఆఫ్రికాలోని ప్రెటోరియాలో ఒక మహిళ సోమవారం ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి కొత్త రికార్డును సృష్టించారు.
గోసియేమ్ థమారా సిట్‌హోల్‌కు స్కానింగ్ చేసినప్పుడు ఆమె గర్భంలో 8 మంది పిల్లలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని ఆమె భర్త అన్నారు.
"చివరికి నా భార్య ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను ప్రసవించింది. నేను చాలా ఆనందించాను. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ప్రస్తుతానికి నేనింకేమీ మాట్లాడలేను" అని ఆమె భర్త టెబోహో సోటేట్సి ప్రెటోరియా న్యూస్‌కు చెప్పారు.
గోసియేమ్ 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు ఒక దక్షిణ ఆఫ్రికా అధికారి బీబీసీకి ధ్రువీకరించారు. కానీ, ఇంకా శిశువులను చూడాల్సి ఉందని మరొక అధికారి అన్నారు.
గోసియేమ్ సాధారణ ప్రసవం ద్వారా ఐదుగురు బిడ్డలకు జన్మనివ్వగా, మిగిలిన ఐదుగురును సిజేరియన్ ద్వారా కన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని వారి కుటుంబ సభ్యులొకరు బీబీసీకి చెప్పారు.
అయితే, బీబీసీ స్వయంగా ఈ విషయాన్ని వైరిఫై చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకే కాన్పులో అత్యధికంగా 9 మంది పిల్లల్ని కనడమే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఒక అమెరికన్ మహిళ మొదటిసారిగా 2009లో 9 మంది పిల్లలకు జన్మనిచ్చారు.
మాలీకి చెందిన 25 సంవత్సరాల హలీమా సిస్సి కూడా గత నెలలో తొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిసింది.
అయితే, ఒకేసారి ఎక్కువ మంది బిడ్డలకు జన్మనిచ్చిన సందర్భాల్లో చాలా సార్లు కొందరు శిశువులు చనిపోయే అవకాశం ఉంటుంది" అని బీబీసీ ఆఫ్రికా హెల్త్ ప్రతినిధి రోడా ఒడియామ్బో అన్నారు.
ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలను కన్న సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం తీసుకునే చికిత్సల్లో ఇలాంటి జననాలు కలిగే అవకాశం ఉంది. కానీ, ప్రెటోరియాలో మహిళ సహజంగానే గర్భం దాల్చినట్లు చెబుతున్నారు.
ప్రార్థనలు, నిద్ర లేని రాత్రులు...
37 సంవత్సరాల గోసియేమ్ గతంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారికిప్పుడు 6 సంవత్సరాలు.
ఆమె గర్భం దాల్చిన 29 వారాలకు పిల్లలకు జన్మనిచ్చారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.
ఆమె గర్భం దాల్చిన మొదట్లో చాలా కష్టంగా అనిపించేదని, పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని ప్రార్ధన చేస్తూ, ఏమవుతుందోననే భయంతో నిద్ర లేని రాత్రులు గడిపానని ఆమె గత నెలలో ప్రెటోరియా న్యూస్‌తో చెప్పారు.
"వారంతా ఈ పొట్టలో సరిపోతారా? వారు బ్రతుకుతారా?" అని ఆమె తనను తానే ప్రశ్నించుకునేవారు. కానీ, పిల్లలు పట్టేందుకు వీలుగా ఆమె పొట్ట సాగుతున్నట్లు ఆమెకు డాక్టర్లు చెప్పారు.
ఆమె గర్భంతో ఉన్నప్పుడు, కాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉండేవారు.
ఇప్పుడు ఆమె, "నా పిల్లలను చూసేందుకు నేనిక వేచి ఉండలేను" అని ఒక వార్తాపత్రికకు చెప్పారు.
ఆమె భర్త కూడా తనకు "ఆకాశంలో తేలుతున్నట్లుగా ఉందని, పిల్లల కోసం తమను భగవంతుడు ఎంపిక చేసుకున్న బిడ్డలుగా అనిపిస్తోందని, ఈ అద్భుతం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- 'శోభనం రాత్రి కోసం తెప్పించే స్పెషల్ స్వీట్’
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









