డోనల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ రాజ్యాంగబద్ధమే... విచారణ కొనసాగుతుందన్న సెనేట్ :Newsreel

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదని, పూర్తి స్థాయి విచారణ ప్రారంభించడానికి అది వీలు కల్పిస్తుందని అమెరికా సెనేట్ గుర్తించింది.

మరోవైపు, వైట్‌హౌస్ వదిలిన తర్వాత ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఆయన తరఫు లాయర్లు వాదించారు.

కానీ, 56-44 తేడాతో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ సభ్యులు దీనిని కొనసాగించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ చర్యలను కొంతమంది రిపబ్లికన్లు కూడా సమర్థించారు.

గత నెల అమెరికా కాంగ్రెస్ మీద దాడి జరిగినపుడు, 'తిరుగుబాటును ప్రేరేపించారని' ట్రంప్ మీద ఆరోపణలు వచ్చాయి.

అమెరికా పార్లమెంటు భవనంలోకి చొచ్చుకొచ్చిన ట్రంప్ అనుకూల నిరసనకారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా పార్లమెంటు భవనంలోకి చొచ్చుకొచ్చిన ట్రంప్ అనుకూల నిరసనకారులు

మంగళవారం ఈ కేసును విచారించిన డెమాక్రాట్లు, జనవరి 6న ట్రంప్ ప్రసంగం, ఆయన మద్దతుదారుల్లో కొందరు చేసిన దారుణమైన అల్లర్ల వీడియోను చూపిస్తూ వాదనలు ప్రారంభించారు.

"ఇది పెద్ద నేరం, దుశ్చర్య" అని మేరీల్యాండ్ రెప్రజెంటేటివ్ జేమీ రస్కిన్ అన్నారు. వీడియో గురించి మాట్లాడిన ఆయన "ఇది అభిశంసించలేని నేరం కాదంటే, అంతకంటే దారుణం ఏదీ ఉండదు" అని చెప్పారు.

ఒక మాజీ అధ్యక్షుడిని అభిశంసన ప్రక్రియకు గురిచేయడం రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్ లాయర్లు వాదించారు. డెమాక్రాట్లు రాజకీయ ప్రేరేపితం అయ్యారని ఆరోపించారు.

విచారణ కొనసాగేలా 56-44 తేడాతో జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు రిపబ్లికన్లు కూడా డెమాక్రాట్లతో కలిశారు.

ఈ ఓటింగ్‌ ఫలితంతో మాజీ అధ్యక్షుడిపై మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ఆయనపై పార్టీలో ఇప్పటికీ చాలా విధేయత ఉందనే విషయం నిరూపితమైంది.

వంద సీట్లు ఉన్న సెనేట్‌లో ట్రంప్‌ను దోషిగా తేల్చడానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.

బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న అభిశంసన ప్రక్రియలో రెండు పక్షాలలో ఒక్కొక్కరికీ తమ వాదనలు వినిపించడానికి 16 గంటల సమయం ఇవ్వనున్నారు.

ఈ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, సాక్ష్యులను పిలిపిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. కానీ విచారణ వేగవంతంగా జరగడానికి రెండు పార్టీల సభ్యులు అనుకూలంగా ఉన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)