భార్యపై కోపంతో ఏకంగా 450 కి.మీ. పాదయాత్ర చేసిన భర్త

ఫొటో సోర్స్, gettyimages
ఇటలీలో ఓ భర్త తన భార్యతో గొడవపడి ఇళ్లొదిలి వెళ్లిపోయాడు.. ఇలాంటివి అక్కడక్కడా జరుగుతుంటాయి కానీ ఈ భర్త మాత్రం ఇంటి నుంచి అలా నడుచుకుంటూ ఏకంగా 450 కిలోమీటర్ల దూరం సాగిపోయాడు.
ఇప్పుడా భర్తను ఇటలీ ప్రజలు సోషల్ మీడియాలో సరదాగా ‘ఫారెస్ట్ గంప్’ అనే నిక్ నేమ్‌తో పిలుస్తున్నారు.
1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో టైటిల్ పాత్ర పోషించిన టామ్ హాంక్స్ ఇలాగే అమెరికా అంతటా వేల కిలోమీటర్లు నడుచుకుంటూ తిరగడంతో ఈ ఇటాలియన్ భర్తను నెటిజన్లు అదే పేరుతో పిలుస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో ఇటలీలోని కోమోలో తన ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ 48 ఏళ్ల భర్త అలా నడుచుకుంటూ తిరుగుతూ వారం రోజుల తరువాత ఫానో సమీపంలో ఆడ్రియాటిక్ కోస్ట్ ప్రాంతానికి చేరగా అక్కడ వేకువజామున 2 గంటలకు స్థానిక పోలీసులు ఆపారు.
లాక్‌డౌన్ సమయంలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ బయట తిరుగుతుండడంతో 400 యూరోల జరిమానా విధించారు.
ఈ సంగతంతా మొదట బొలాగ్నో నుంచి వచ్చే వార్తాపత్రిక ‘ఇల్ రెస్టో డెల్ కార్లినో’లో వచ్చింది.
ఆ తరువాత ఇటలీ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాఖ్యానాలు చేశారు.
కొందరు ఆయన్ను హీరోగా అభివర్ణిస్తూ ఆయనకు జరిమానా విధించడాన్ని తప్పుపట్టారు. ‘ఆయనకు ఒక కొత్త బూట్ల జత ఇవ్వాలి. ఇలా ఫైన్ వేయకూడదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్.. భార్యపై కోపంతో హింసకు దిగకుండా తనను తాను కూల్ చేసుకోవడానికి ఇలా నడుచుకుంటూ వెళ్లిపోయినందుకు అభినందించారు.
కాగా పోలీసులు ఆయన్ను విచారించినప్పుడు తాను కోమో నుంచి నడుచుకుంటూనే వచ్చానని, వాహనాలను ఆశ్రయించలేదని చెప్పారు.
‘‘దారిలో ఎందరో నాకు ఆహారం, పానీయాలు ఇచ్చారు. కొంచెం అలసిపోయాను కానీ బాగానే ఉన్నాను నేను’’ అన్నారాయన.
ఆయన తన ప్రయాణంలో సగటున రోజుకు 60 కిలోమీటర్లు నడిచారట.
ఆడ్రియాటిక్ కోస్ట్ హైవేపై రాత్రి వేళ చలిలో గమ్యం లేకుండా నడుచుకుంటూ వెళ్తుండడంతో పోలీసులు ఆయన్ను ఆపి ప్రశ్నించారు.
ఆయన ఐడీ చూసి తమ డాటాబేస్ చెక్ చేసిన తరువాత ఆయన భార్య అప్పటికే తన భర్త కనిపించడం లేదని కేసు నమోదు చేసినట్లు గుర్తించారు.
అనంతరం ఆమెను సంప్రదించి ఆచూకీ చెప్పడంతో ఆమె ఫానోకు వచ్చి భర్తను తీసుకువెళ్లారు.

ఇవి కూడా చదవండి:
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








