పాకిస్తాన్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయంటే..

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు

ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు సైతం ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి, దుర్గాదేవిని 9 రోజులపాటు భక్తితో కొలుస్తున్నారు.

కరాచీనుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ అందిస్తున్న కథనం.

నవరాత్రి ఉత్సవాల్లో స్థానిక హిందువులు దుర్గాదేవిని ఆరాధిస్తూ, రకరకాల నైవేద్యాలను సమర్పించి 9 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

పాకిస్తాన్‌- కరాచీలోని రణ్‌ఛోడ్ లేన్ సమీపంలో ఉన్న నారాయణ్‌పురా ప్రాంతంలో గుజరాతీ హిందువులు దాదాపు 1500 మంది నివాసం ఉంటున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో నారాయణ్‌పురా ప్రాంతంలోని మహిళలంతా ఉత్సాహంగా దాండియా ఆడతారు.

పాకిస్తాన్‌లోని చాలా మంది హిందువులు భారత్‌లో ఉన్న ఆలయాలను సందర్శించాలని కోరుకుంటున్నారు.

మహమ్మారి తీవ్రంగా ఉన్నరోజుల్లో కూడా ఇక్కడ అన్ని మతాల వాళ్లూ పండగలు జరుపుకుంటూనే వచ్చారు. కాబట్టి, కరోనా కాలంలో కూడా కరాచీలో నవరాత్రి వేడుకలు ఏమాత్రం కళ తప్పలేదు. మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం లాంటి వాటిన్నింటినీ పక్కన పెట్టి ప్రజలంతా నవరాత్రి సంబరాల్లో మునిగితేలుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)