చైనా, భారత్: రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ఏం చెప్పారు.. ఉద్రిక్తతలు తగ్గుతాయా

ఫొటో సోర్స్, @DEFENCEMININDIA
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబరు 4న చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘేతో సమావేశమయ్యారు. రెండు దేశాల సరిహద్దుల్లో ప్రస్తుత ఉద్రిక్తతలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి భారత సైనికులు బాధ్యతాయుత వైఖరితో ఉంటారని రాజ్‌నాథ్ చైనా రక్షణ మంత్రికి చెప్పారు.‘మా దేశ సౌర్వభౌమాధికారాన్ని, సరిహద్దులను పరిరక్షించుకోవాలనే మా నిబద్ధతను ఎవరూ శంకించకూడదు’ అని కూడా రాజ్‌నాథ్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ దగ్గర చైనా భారీ సంఖ్యలో సైనికులను మోహరించడం, వారి కార్యకలాపాలు, దూకుడుగా వ్యవహరించడం లాంటివి రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని రాజ్‌నాథ్ సింగ్ చైనాకు స్పష్టంగా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఇరు దేశాల అగ్ర నేతలు ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు అంగీకరించారు, భారత్-చైనా పరస్పర సంబంధాల బలోపేతానికి అది అవసరం. విబేధాలను వివాదాల వరకూ పెంచవద్దు" అని భారత రక్షణ మంత్రి చెప్పారు. చైనా భారత్‌తో కలిసి ఈ ఉద్రిక్తతలకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దానికి పాంగాంగ్ త్సో సరస్సుతోపాటూ సరిహద్దుల్లో సైనికుల మోహరింపు తగ్గించాల్సి ఉంటుందని కూడా రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రికి వివరించారు.ప్రస్తుత పరిస్థితిని తెలివిగా చక్కదిద్దాల్సి ఉంటుంది. పరిస్థితి జటిలంగా మారేలా ముందు ముందు ఎవరూ ఎలాంటి చర్యలకూ దిగకూడదని కూడా ఆయన వెంగ్ ఫెంఘేకు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా రక్షణమంత్రి ఏమన్నారు
అటు, చైనా వార్తా పత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' చైనా ప్రభుత్వ వార్తా ఏజెన్సీ జిన్‌హువాను ఉటంకిస్తూ ఒక వార్త ప్రచురించింది.
అందులో గత నెల సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలకు భారత్ కారణమని చైనా ఆరోపించిందని, ఉద్రిక్తతలు తగ్గించాలని చైనా రక్షణ మంత్రి భారత రక్షణ మంత్రిని కోరారని రాశారు.రెండు దేశాల రక్షణ మంత్రుల మధ్య ఈ చర్చలు సుమారు రెండు గంటలపాటు సాగాయి. "సరిహద్దుల్లో ప్రస్తుత ఉద్రిక్త స్థితికి కారణం, వాస్తవం స్పష్టంగా తెలుస్తోంది. దీనికి భారత్ పూర్తి బాధ్యత వహించాలి" అని చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘే అన్నట్లు చెబుతున్నారు. "చైనా తన ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోదు, జాతీయ సౌర్వభౌమాధికారాన్ని, మా సరిహద్దులను కాపాడుకోవాలని చైనా సైన్యం పూర్తి నిబద్ధత, సామర్థ్యంతో నిశ్చయించుకుంద"ని వెయ్ పెంఘే అన్నారు.ఆ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం భారత్ ఉద్రిక్తతలను ప్రోత్సహించదనే తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. "దీనిపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి ఒప్పందం జరిగింది. భారత్ ఉద్రిక్తతలను ప్రోత్సహించకూడదు, తప్పుడు వాస్తవాలను కూడా ప్రచారం చేయకూడద"ని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత చైనా, భారత్ దౌత్య నాయకత్వ స్థాయిలో ముఖాముఖి చర్చలు జరగడం ఇదే మొదటిసారి.జూన్ 14, 15న జరిగిన ఈ హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మృతిచెందారు.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








