మద్యం తయారీ ఆపేసి శానిటైజర్లు తయారుచేస్తున్నారు

శానిటైజర్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.

యూకేలోనూ శానిటైజర్లు దొరకడం లేదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో కానీ, బయట దుకాణాల్లో కానీ ఎక్కడా శానిటైజర్ అనేదే లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో యూకేలోని కొన్ని మద్యం తయారీ సంస్థలు శానిటైజర్ల తయారీకి సిద్ధమవుతున్నాయి.

స్కాట్లాండ్‌లో జిన్ తయారుచేసే ఓ డిస్టిలరీ ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్ల తయారీకి సిద్ధమైంది. స్థానిక ఆరోగ్య సేవల సంస్థలు కోరడంతో ఆ డిస్టిలరీ ఇందుకు సిద్ధమైంది.

వెర్డాంట్ స్పిరిట్స్ అనే ఆ సంస్థ ఈ వారంలోనే పని మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. 400 లీటర్ల శానిటైజింగ్ జెల్ తయారుచేస్తామని తెలిపింది.

మరో రెండు డిస్టిలరీలను కూడా స్థానిక హెల్త్ కేర్ గ్రూప్స్ ఈ మేరకు కోరాయి.

ఆండ్రూ మెకంజీ
ఫొటో క్యాప్షన్, ఆండ్రూ మెకంజీ

శానిటైజర్లలోనూ ఆల్కహాల్ ఉంటుంది..

మద్యం తయారీలో ఆల్కహాల్ వినియోగించినట్లే శానిటైజర్లకూ ఆల్కహాల్ వాడుతారు. అయితే, దాంతోపాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ , గ్లిజరిన్ వంటి ఇతర రసాయనాలూ వినియోగిస్తారు.

వెర్డాండ్ స్పిరిట్స్ యజమాని ఆండ్రూ మెకంజీ మాట్లాడుతూ గ్లిజరిన్ సులభంగా దొరకడం లేదని, గ్లిజరిన్ విక్రయంపై నియంత్రణ ఉండడంతో తమకు 20 లీటర్లే దొరికిందని చెప్పారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం కూడా ఫేస్‌బుక్‌లో పిలుపిచ్చినట్లు చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్లో చూసి శానిటైజర్ల తయారీకి కావాల్సిన వస్తువులేంటో తెలుసుకున్న ఆయన వాటిని సమకూర్చుకునే పనిలో పడ్డారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

బీర్లు తయారుచేసే సంస్థా అదే పనిలో..

యూకేలో ప్రముఖ బీర్ బ్రాండ్ బ్రూడాగ్ కూడా శానిటైజర్ల తయారీకి సిద్ధమైంది.

'కొరత నుంచి బయటపడేందుకు మేం శానిటైజర్ల తయారీకి ఉద్యుక్తులవుతున్నాం. స్కాట్కాండ్‌లోని మా డిస్టిలరీలో ఈ మేరకు అన్నీ సిద్ధం చేస్తున్నామ''ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

తాము తయారుచేసే శానిటైజర్లను అవసరమైన వారికి ఉచితంగా ఇస్తామని చెబుతోందీ సంస్థ.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)