ఆస్ట్రేలియా కార్చిచ్చుతో 113 జంతువుల జాతులు ‘పూర్తిగా అంతరించిపోతున్నాయి’.. అత్యవసర సహాయం అవసరం అంటున్న నిపుణులు

ఫొటో సోర్స్, Reuters
ఆస్ట్రేలియాలో ఇటీవల సంభవించిన కార్చిచ్చులతో అనేక జంతు జాతుల ఆవాసాలు కాలిపోయాయి. దీంతో 113 జీవ జాతులకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా పేర్కొంది.
అయితే, జీవ జాతులేవీ పూర్తిగా అంతరించడం లేదని, ఇది ఆహ్వానించదగిన పరిణామంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది.


గత వేసవిలో దక్షిణ, తూర్పు ఆస్ట్రేలియాలో తలెత్తిన మంటలతో అధిక సంఖ్యలో జీవ జాతులు 30 శాతం వరకు జీవావరణాన్ని కోల్పోయాయి.
కోలాలు, వాల్లబీలు, పక్షులు, కప్పలు, కొన్ని రకాల మత్స్య జాతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.
ఆస్ట్రేలియా పచ్చిక బయళ్ళని నాశనం చేసిన ఈ మంటల్లో వంద కోట్ల జంతువులు అంతమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
13పక్షులు
20సరీసృపాలు
5కీటకాలు, పురుగులు
19 క్షీరదాలు
22 క్రే ఫిష్
17చేపలు
తక్షణ సహాయం అందించాల్సిన కొన్ని జీవ జాతుల పేర్ల జాబితాని వైల్డ్ లైఫ్ అండ్ థ్రెటెండ్ స్పీసీస్ బుష్ ఫైర్ రికవరీ ఎక్స్పర్ట్ పానెల్ మంగళవారం విడుదల చేసింది.
కొన్ని జంతు జాతుల జీవావరణం పూర్తిగా నాశనం కావడంతో వాటి మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ జాబితా పేర్కొంది. వీటిలో పుగ్స్ ఫ్రాగ్, బ్లూ మౌంటైన్స్ వాటర్ స్కింక్, కంగారు ఐలాండ్ దనార్ట్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, JODY GATES/SA DEPARTMENT FOR ENVIRONMENT AND WATER

ఫొటో సోర్స్, ENVIROGOV/DAVE HUNTER
కోలా, స్మోకీ మౌస్ జాతులు నివసించే ఆవాసాలు ఎక్కువ ప్రభావానికి గురవ్వడంతో వీటి మనుగడకి అత్యవసర ప్రాతిపదికన సహాయం అందించాల్సిన అవసరం ఉంది.
కొన్ని జీవ జాతులని మంటలు తలెత్తక ముందే అంతరించిపోతున్న జాబితాలో చేర్చడం వలన అదనంగా చేపట్టిన చర్యలు వాటికి రక్షణ కల్పించగలిగాయి
ఇంకా చాలా జీవజాతులు సురక్షితం అని తేల్చినప్పటికీ అవి నివసించే జీవావరణాన్ని మాత్రం చాలా వరకు ఈ కార్చిచ్చుల్లో కోల్పోయాయని నివేదిక పేర్కొంది.
తదుపరి విడుదల చేసే జాబితాలో మరిన్ని వృక్ష , జీవ జాతులని చేర్చే అవకాశం ఉందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి సూసన్ లే తెలిపారు.
ఇంకా అక్కడక్కడా చెలరేగుతున్న మంటలు, కాలుతున్న భూముల వలన, విధ్వంసపు నష్టాలని పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు వీలు కాలేదని ఆమె అన్నారు.
ఆస్ట్రేలియా గత నెలలో వన్య ప్రాణ సంరక్షణ, జీవావరణ పునరుద్ధరణ కోసం 239 కోట్ల రూపాయిల నిధుల్ని సేకరిస్తామని ప్రకటించింది. ఈ నిధుల్ని జీవరాసుల వైద్యం, ఆహారం, జంతువులకి చీడ నివారణ చర్యల కోసం ఉపయోగిస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









