క్యాన్సర్ చికిత్సకు వంటింటి చిట్కాలు మేలు చేస్తాయా? హాని చేస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
హెర్బల్ ఉత్పత్తులను వాడే క్యాన్సర్ రోగులు తమ డాక్టర్లకు ఆ విషయం కచ్చితంగా చెప్పాల్సిందేనని, కొన్ని ఉత్పత్తులు చికిత్సకు అడ్డుపడుతాయని ఓ క్యాన్సర్ సదస్సులో పేర్కొన్నారు.
రొమ్ము క్యాన్సర్ బాధితులు వెల్లుల్లి, అల్లం, జింగో మాత్రలు వాడటం వల్ల వారి చర్మ గాయాలు నయం కావడం ఆలస్యమవుతుందని వెల్లడించారు.
మూలికా చికిత్సలు క్యాన్సర్ పై పనిచేసినట్లు ఆధారాలు లేవని సర్జన్ ప్రొఫెసర్ మరియా జోవో కార్డోసో అన్నారు.
అనుమానం ఉన్నవాటిని తీసుకోకపోవడమే మంచిది అని ఆమె చెప్పారు.
''క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులు ఏం తీసుకుంటున్నారో డాక్టర్లు అడగాలి. ఈ విషయంలో వారు క్రీయాశీలంగా వ్యవహరించాలి'' అని ప్రొఫెసర్ కార్డోసో పేర్కొన్నారు.
పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఉన్న చాంపలిమౌడ్ క్యాన్సర్ సెంటర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆమె బీబీసీతో మాట్లాడారు.
క్యాన్సర్ రోగులు ఏవైనా హెర్బల్ ఉత్పత్తులను వాడటానికంటే ముందు చికిత్స చేస్తున్న డాక్టర్‌కు వాటి గురించి చెప్పడం చాలా ముఖ్యమని ఆమె సూచించారు.
ప్రతీ ఐదు రొమ్ము క్యాన్సర్ కేసులలో ఒకటి ఇలా జరుగుతోంది. మిగిలిన క్యాన్సర్ల విషయంలో ఇలాంటి తక్కువేనని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''చాలా ఉత్పత్తులు హర్మోన్ చికిత్స లేదా కీమోథెరపీలలో అడ్డుపడుతాయి. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని ఉత్పత్తులు రక్తం గడ్డకట్టే ప్రక్రియను ఆపుతాయి. దీనివల్ల చర్మ గాయాలు తగ్గడానికి చాలా సమయం పడుతుంది.'' అని ఆమె వివరించారు.
రక్తం గట్టకట్టే ప్రక్రియను ఆపే కొన్ని ఉత్పత్తుల గురించి ఆమె తెలిపారు. అవి
- నేలవాము
- ఫివర్ ఫ్యూవ్
- అల్లం
- జింకో
- జిన్సెంగ్
- హవ్‌త్రోన్
- హార్స్ చెస్‌నట్
- పసుపు

ఫొటో సోర్స్, Getty Images
ఆరెంజ్, ద్రాక్ష పండ్ల రసం వద్దు
''రోగులు, వారి సంరక్షకులు ప్రత్యామ్నాయ చికిత్సల కోసం వెతకడంలో ఆశ్చర్యకరం ఏం లేదు. కానీ, ఇలాంటివి మంచి కంటే హానే ఎక్కువ చేస్తాయని ప్రజలు తెలుసుకోవాలి'' అని ఆమె పేర్కొన్నారు.
కొన్ని హెర్బల్ ఉత్పత్తులు క్యాన్సర్ చికిత్సను అడ్డుకోవచ్చని ఇంగ్లండ్‌లోని క్యాన్సర్ పరిశోధన సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
క్యాన్సర్ చికిత్స సమయంలో రోగులు ద్రాక్ష పండ్ల రసం, ఆరెంజ్ జ్యూస్ తీసుకోకూడదని, కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకపోవడం ముఖ్యమని కూడా ఆ సైట్ సూచించింది.
''మీరు ఏదైనా హెర్బల్ ఉత్పత్తులను వాడాలనుకుంటే మందుగా డాక్టర్‌కు చెప్పండి. మరీ ముఖ్యంగా మీరు చికిత్స మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటివి వాడాలనుకుంటే మీ డాక్టర్‌తో మాట్లాడటం చాలా ముఖ్యం'' అని ఆ సంస్థ తెలిపింది.
రొమ్ము క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థకు చెందిన నర్స్ గ్రెట్ బరుటెన్ స్మిత్ మాట్లాడుతూ, ''క్యాన్సర్‌ను నయం చేస్తాయని నిరూపితంకాని అనేక ఉత్పత్తుల గురించి ఆన్‌లైన్‌లో చాలా సమాచారం ఉంది. కొద్దిగా పనిచేస్తాయని నిరూపితమైన ఉత్పత్తుల గురించి కూడా ఉంది. అయితే, దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం వైద్య నిపుణుడిని సంప్రదించాలి'' అని పేర్కొన్నారు.
అడ్వాన్స్‌డ్ బ్రెస్ట్ క్యాన్సర్‌పై నిర్వహించిన ఐదో అంతర్జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కార్డోసో మాట్లాడుతూ, ''యోగా, మెడిటేషన్, రేకి, అక్యుపంక్చర్ లాంటివి రోమ్ము క్యాన్సర్ రోగులపై సానుకూల ప్రభావం చూపించాయి'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అరుణ్ జైట్లీకి వచ్చిన సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ ఎలా వేధిస్తుంది...
- అయోధ్య తీర్పుపై ఐదు ప్రశ్నలు
- అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ
- కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?
- 'అయోధ్య పీటముడిలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చిక్కుకుపోయింది’
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








