పాకిస్తాన్: కరాచీ-రావల్పిండి రైలులో అగ్నిప్రమాదం... 74 మంది ప్రయాణికులు మృతి

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న ఓ రైలు మంటల్లో చిక్కుకోవడంతో 74 మందికి పైగా ప్రయాణికులు మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు.
కరాచీ నుంచి రావల్పిండికి ప్రయాణించే తేజ్ గామ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
వంట చేసుకునేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం 3 బోగీలకు మంటలు వ్యాపించాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
మంటల్లో కాలిపోతున్న రైలు నుంచి బయటకు దూకే క్రమంలో చాలా మంది ప్రయాణికులు మరణించారని అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
మరో 40 మంది గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వారు భావిస్తున్నారు.
మృతులను గుర్తించడంలో ఆలస్యం అవుతోంది.

ఫొటో సోర్స్, PAKISTAN RAILWAY
పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీమ్ యార్ ఖాన్ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

ఫొటో సోర్స్, ASIM TANVIR
ఇమ్రాన్ ఖాన్ సంతాపం
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారని, బాధితులకు తక్షణమే పూర్తి వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారని రేడియో పాకిస్తాన్ తెలిపింది.
తర్వాత రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రయాణికులు, రైలుకు బీమా ఉందని, నష్టానికి పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని అన్నారు.
"చనిపోయిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైలు పట్టాలు తప్పలేదు కాబట్టి ఒక గంటలో దాన్ని లియాఖత్‌పూర్ జంక్షన్‌కు తరలిస్తాం" అని మంత్రి తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఈ మార్గంలో నడిచే అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. కానీ ఇప్పుడు అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి.
"మంటలు అదుపులోకి వచ్చాయి. మూడు బోగీలు దగ్ధమయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించాం" అని మంత్రి వెల్లడించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రమాదం జరిగిన రైల్లో కొందరు ప్రయాణికులు లాహోర్లో జరిగే ఇజ్తిమాకు వెళ్తున్నారని రైల్వే మంత్రి చెప్పారు.
వారు సిలిండర్లు, వంటసామగ్రి, స్టౌలు తెచ్చుకోవడం, వాటిని ఉపయోగించి వంటచేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.
సిలిండర్ పేలడం వల్లే 62 మంది ప్రయాణికులు మృతి చెందారు.
ఒక ప్రైవేట్ చానల్‌తో మాట్లాడిన మంత్రి "ఒకే పేరుతో చాలా బోగీలను బుక్ చేశారని, అధికారులు మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని" చెప్పారు.
మృతుల కుటుంబాలకు 15 లక్షలు, గాయపడినవారికి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి.
- అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎర.. లక్షలు పోగొట్టుకున్న విశాఖ యువకులు
- ప్రధాని మోదీ వస్తున్నారంటే ఆ కాలనీ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
- కశ్మీర్లో ఇక ఎలాంటి మార్పులు రానున్నాయ్
- కశ్మీర్లో పర్యటించిన 23 మంది యూరప్ ఎంపీలు ఏమంటున్నారు...
- తెలంగాణ ఆర్టీసీ సకల జనభేరి: ‘ప్రభుత్వంలో విలీనం సహా డిమాండ్లన్నీ సాధించేవరకూ పోరాటం ఆగదు’
- అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








