సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, @NARENDRAMODI
- రచయిత, హర్ష్ పంత్
- హోదా, బీబీసీ కోసం
గత కొన్నేళ్లుగా భారత్, అతిపెద్ద గల్ఫ్ దేశం సౌదీ అరేబియా మధ్య సంబంధాల్లో ఎంత పెద్ద మార్పు కనిపిస్తోందంటే, ఈ వారం భారత ప్రధాన మంత్రి సౌదీ పర్యటనలో దానికి ఒక ఉదాహరణ కనిపించింది.
గత మూడేళ్లలో మోదీ రెండోసారి సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. 2016లో మోదీ మొదటిసారి సౌదీలో పర్యటించినపుడు సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఆయనకు సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు.
సౌదీలో రెండోసారి పర్యటించినపుడు మోదీకి 'ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ ఇనిషియేటివ్ సమ్మిట్'లో పాల్గొనే అవకాశం లభించింది. దానిని 'దావోస్ ఇన్ ద డెజర్ట్' అంటే ఎడారిలో దావోస్ అంటారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో ఈ సమిట్ నిర్వహించారు.
కశ్మీర్ అంశంలో భారత్‌కు మద్దతు
మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇదే ఏడాది ఫిబ్రవరిలో భారత్ వచ్చారు. భారత్ ఇటీవల కశ్మీర్ రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద అందే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది.
పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తేందుకు ఏ అవకాశాన్నీ వదల్లేదు. అలాంటప్పుడు మోదీ సౌదీ అరేబియా పర్యటన మరింత కీలకంగా మారింది.
సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న మోదీ భారత్‌లోని ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశాన్ని కోరారు. చమురు, గ్యాస్ ఆధారిత ప్రాథమిక మౌలిక సదుపాయాల్లో భారత్ 2024 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యయం చేయాలనే ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
బలమైన ట్రేడ్ పార్టనర్
ఈ నిధులతో భారత ఇంధన రీఫైనరీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. మోదీ వివరాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థను మరో ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానికోసం ఇంధన అవసరాల్లో మరింత విస్తరణ జరుగుతుంది.
"రాజకీయ స్థిరత్వం, ఊహాజనిత విధానం, విభిన్న మార్కెట్ వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టడం అత్యంత లాభదాయకంగా ఉంటుందని" పెట్టుబడిదారులకు మోదీ భరోసా ఇచ్చారు.
భారత్ మరి కొన్నేళ్లలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు 1.5 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందించిందని మోదీ చెప్పారు. సౌదీ చమురు కంపెనీ ఆరాంకోను ఉదాహరణగా చెప్పిన మోదీ, ఆ సంస్థ మహారాష్ట్రలోని రీఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతోందని, ఆసియాలో అతిపెద్ద రీఫైనరీ కంపెనీ అయిన అది, ఆరు కోట్ల టన్నుల చమురు ఉత్పత్తి చేస్తోందని చెప్పారు.
భారత్, సౌదీ అరేబియా వాణిజ్యం గత కొన్నేళ్లుగా వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ ఈ సంబంధాలు కొనుగోలుదారులు, విక్రేతగా మాత్రమే ఉండవు. అయితే, భారత్, సౌదీ అరేబియా వాణిజ్య సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన రంగమే.
ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సప్లయర్ అయ్యింది. సౌదీ అరేబియా ఇప్పుడు భారత్‌కు నాలుగో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత్‌లో పెరుగుతున్న సౌదీ పెట్టుబడులు
రెండు దేశాల మధ్య 2017-18లో 27.48 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. సౌదీ అరేబియా భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ పెట్టుబడులు ఇంధన, రీఫైనరీ, పెట్రో కెమికల్స్, వ్యవసాయం, గనుల రంగాల్లో ఉంటాయి. భారత్, సౌదీ అరేబియా బంధం మోదీ రియాద్‌లో తన ప్రసంగంలో చెప్పినట్లు మెల్లమెల్లగా వ్యూహాత్మకంగా అవుతోంది.
మోదీ సౌదీ అరేబియా పర్యటనలో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మొదటి ఒప్పందం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, సౌదీ ఆరాంకో మధ్య జరిగింది. దానివల్ల కర్ణాటకలో చమురు నిల్వచేసే రెండో ప్లాంట్ ఏర్పాటు చేయడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తుంది.
రెండో ఒప్పందం భారత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పశ్చిమాసియా యూనిట్, సౌదీ అరేబియా అల్-జెరీ కంపెనీ మధ్య జరిగింది. అదే సమయంలో ఇండియా-సౌదీ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని కూడా మోదీ ప్రకటించారు. ఈ కౌన్సిల్లో రెండు దేశాల నేతృత్వం ఉంటుంది. భారత్ తన ఆశలు, ఆకాంక్షలను పూర్తి చేసుకోడానికి ఇది సహకరిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సౌదీ అరేబియాలో 26 లక్షల భారతీయులు
సౌదీ అరేబియాలో నివసించే భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 26 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఇంతకు ముందుకంటే భిన్నంగా భారత్ ఇప్పుడు ద్వైపాక్షిక చర్చల్లో ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలు, వారి ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవడంలో ఏమాత్రం వెనకాడడం లేదు.
సౌదీ అరేబియాలో ఉంటున్న భారత సమాజం కఠిన శ్రమ, నిబద్ధత గురించి భారత ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. వారివల్ల రెండు దేశాల సంబంధాలు బలంగా ఉంటాయని చెప్పారు.
ఆయన తన ప్రసంగంలో సౌదీలో ఉంటున్న భారతీయులను చేరే ప్రయత్నం చేశారు. "భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది. ఎందుకంటే మీరు సౌదీలో ఒక స్థానం ఏర్పరుచుకున్నారు. మీ కఠిన శ్రమ, నిబద్ధత మన ద్వైపాక్షిక బంధాల్లో తియ్యదనం తెచ్చేందుకు, వాటిని బలోపేతం చేసేందుకు సహకరించాయి" అన్నారు.
భారత్ సౌదీ అరేబియాతో కొనసాగిస్తున్న సంబంధాల ఫలితంగా, రాజకీయ వేదికల మీద సౌదీ నుంచి సానుకూల వైఖరి రూపంలో లబ్ధి చేకూరుతోంది. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు చేయాలనే భారత నిర్ణయంపై కూడా సౌదీ వైఖరి సానుకూలంగా ఉంది. అది టర్కీ, మలేసియాకు భిన్నంగా స్పందించింది. కశ్మీర్ అంశంలో పెరుగుతున్న సంక్షోభం గురించి అది పాకిస్తాన్‌ను హెచ్చరించింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా రియాద్‌లో పర్యటించారు. పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాతో సంప్రదాయిక సంబంధాలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కశ్మీర్ అంశంలో భారత్ ఆందోళన, ఆవేదనను తాము అర్థం చేసుకోగలమనే సంకేతాన్ని సౌదీ ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సౌదీ అరేబియా భారత్ స్నేహం ఎందుకు కోరుకుంటోంది?
ఈ నిర్ణయాలన్నీ ఏదో ఒక విధంగా సౌదీ అరేబియా ఆర్థిక మోడల్ ప్రమాదంలో ఉన్నట్లు సంకేతాలు కూడా ఇస్తున్నాయి. సౌదీ అరేబియాకు భారత్ లాంటి సహకరించే దేశం అవసరం ఉంది. ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్న వారం లోపే, భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు సౌదీ అరేబియాలో ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తన ఆయిల్-కెమికల్ పరిశ్రమలోని 20 శాతం షేర్లు సౌదీ అరేబియా కంపెనీ ఆరాంకోకు విక్రయించాలని నిర్ణయించింది. వాటి విలువ 75 బిలియన్ డాలర్లు. ఇది సౌదీ అరేబియాలో ఇప్పటివరకూ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఫ్‌డీఐ)ఒకటి అవుతుంది.
ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభ సమయంలో భారత్, సౌదీ అరేబియా తమ విదేశాంగ విధానం, ప్రాధాన్యతలకు కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు భారత్‌కు పశ్చిమాసియాలో అత్యంత ఆకర్షణీయంగా మారుతున్నాయి.
అటు, సౌదీ అరేబియా కోసం భారత్ ప్రపంచంలోని ఎనిమిది పెద్ద శక్తుల్లో ఒకటి అయ్యింది. దీనితోపాటు తన 'విజన్ 2030' కింద అది వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటోంది. అందుకే భారత్, సౌదీ అరేబియా సంబంధాల్లో కొత్త శక్తి వస్తున్నట్లు కనిపిస్తుంటే, దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? నష్టాలు, జీతాలపై లెక్కల్లో వాస్తవాలేమిటి?
- ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- ‘ఇది నాలాంటి వారికోసం డిజైన్ చేసిన ప్రపంచం కాదు’
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- రాయల్ వశిష్ట: బోటులో ఏడు మృతదేహాలు, ఒకరి ఎముకల గూడు.. వీటిని ఎలా గుర్తించారు
- మహారాష్ట్ర 'కుల దురహంకార హత్య' కేసులో కొత్త కోణం... భర్త పైనే అనుమానాలు
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








