హింస, బెదిరింపులు ఆమోదయోగ్యం కావు: కశ్మీర్‌పై పాక్ సంఘాల ర్యాలీనుద్దేశించి బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే 370 అధికరణ సవరణపై బ్రిటన్‌లోని పాకిస్తాన్ అనుకూల సంఘాలు చేస్తున్న ఆందోళనలపై ఆ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు.

''హింస, బెదిరింపులు ఎక్కడా ఆమోదయోగ్యం కావు'' అని బుధవారం పార్లమెంట్‌లో అన్నారు.

పాకిస్తాన్ అనుకూల సంఘాలు లండన్‌లోని భారత హై కమిషన్ ముందు దీపావళి రోజున 10 వేల మందితో తలపెట్టిన నిరసనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్‌లో ప్రశ్నించారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన బోరిస్ జాన్సన్‌ను ఉద్దేశిస్తూ, ''అక్టోబర్ 27న భారత హై కమిషన్ ముందు హింసాత్మక ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి'' అని కోరారు.

దీనికి ప్రధాని సమాధానమిస్తూ, '' హింస, బెదిరింపులు ఎక్కడా ఆమోదయోగ్యం కావు. ఇది పోలీసు ఆపరేషన్‌కు సంబంధించిన విషయం. హోం సెక్రటరీ ఈ విషయంపై పోలీసులతో సమన్వయం చేసుకుంటారు'' అని పేర్కొన్నారు.

కశ్మీర్‌పై నిరసన

ఫొటో సోర్స్, Getty Images

10 వేల మందితో ర్యాలీ

పాకిస్తాన్ అనుకూల సంఘాలు ఇప్పటికే రెండు సార్లు భారత హైకమిషన్ ముందు ఆందోళన నిర్వహించాయి.

ఆగస్టు 15న జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. సెప్టెంబర్ 3న కూడా ఇదే రీతిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అక్టోబర్ 27న దీపావళి రోజున 10 వేల మందితో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.

అయితే, ఇలాంటి ర్యాలీలను అడ్డుకోవాలని లండన్ మేయర్ సాధిక్‌ ఖాన్‌కు పలువురు లేఖ రాశారు.

కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, లండన్ అసెంబ్లీ సభ్యుడు నవీన్ షా లేఖలు రాసినవారిలో ఉన్నారు.

లండన్ మేయర్ సాధిక్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ర్యాలీని విరమించుకోండి: లండన్ మేయర్

దీపావళి రోజు భారత హై కమిషన్ భవనం ముందు పాక్ అనుకూల సంఘాలు చేపట్టనున్న ర్యాలీ ప్రణాళికను లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ఖండించారు.

ఇలాంటి చర్యలు లండన్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తాయని, నిర్వహకులు తమ ప్రణాళికను రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

లండన్ మేయర్ పేరుతో విడుదలైన లేఖలో ''భారత హై కమిషన్ ముందు దీపావళి రోజున ఆందోళన నిర్వహించాలనుకోవడం పూర్తిగా ఖండనీయం. ఈ నిరసన ర్యాలీ వేర్పాటుకు దారి తీస్తుంది. ఈ ర్యాలీ నిర్వాహకులు, అందులో పాల్గొనే వారు మరోసారి ఆలోచించాలి'' అని కోరారు.

ఈ లేఖను అక్టోబర్ 18న విడుదల చేశారు.

'' ఆందోళనలను అడ్డుకునే హక్కు హోం మంత్రికి ఉంది. ఈ లేఖను నేను హోం మంత్రి ప్రీతి పటేల్, మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ క్రెసిడా డిక్‌లకు కూడా పంపిస్తాను. వాళ్లు మా ఆందోళనలను అర్థం చేసుకుంటారు'' అని సాధిక్ ఖాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)