చంద్రయాన్ 2: ల్యాండర్ ‘విక్రమ్’ దిగాల్సిన ప్రదేశం ఫొటోలు తీసిన నాసా

ఫొటో సోర్స్, NASA/twitter
చంద్రయాన్ 2లో ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష సంస్థ నానా వెల్లడించింది. నాసా తాజాగా చంద్రయాన్ 2 ల్యాండింగ్ సైట్‌కి చెందిన హై రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేసింది.
చంద్రయాన్ 2 ల్యాండర్ ఆచూకీ కనిపెట్టేందుకు నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిట్ కెమెరా తీసిన చిత్రాలను సెప్టెంబర్ 26న ట్వీట్ చేసింది.
అయితే ఈ చిత్రాలను రాత్రి వేళ తీసినందున విక్రమ్ ఆచూకీ స్పష్టంగా కనిపెట్టలేకపోయామని నాసా స్పష్టం చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అక్టోబరులో ఆ ప్రాంతంలో వెలుగు వస్తుందని అప్పుడు కచ్చితంగా ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెడతామని నాసా తెలిపింది.

ఫొటో సోర్స్, NASA
చీకట్లో ఉండొచ్చు
నాసా తన వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం... సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి మీద హార్డ్ ల్యాండ్ అయ్యింది. అంటే అది చంద్రుడి ఉపరితలాన్ని నేరుగా ఢీకొట్టింది.
ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17న తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిటర్ కెమెరా 150 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ తీసిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది.
అయితే తమ బృందాలు విక్రమ్ ల్యాండర్‌ను కానీ, అది కూలిన ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోయాయని తెలిపింది.
ఈ చిత్రాలు తీసే సమయంలో చంద్రుడి మీద ప్రాంతమంతా చీకటిగా ఉంది. ఆ పెద్ద పెద్ద చీకటి ప్రాంతాల్లో ఎక్కడో విక్రమ్ ఉండి ఉండవచ్చని నాసా తన వెబ్ సైట్లో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- పెళ్లిలో బీఫ్ బిర్యానీ వడ్డించిన కేసులో జైలుకెళ్లిన వ్యక్తిని విడుదల చేసిన గుజరాత్ హైకోర్టు
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- ఈ చైనా మహిళ గాంధీ ప్రభావంతో శాకాహారిగా మారారు, పాత దుస్తులు ధరిస్తారు, ఇంకా..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








