చంద్రయాన్ 2 తొలి దశ విజయవంతం

ఫొటో సోర్స్, Getty Images
చంద్రయాన్-2 ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే (మధ్యాహ్నం 2.43 గంటలకు) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి చంద్రయాన్-2 ను నింగిలోకి పంపింది.
జులై 15న చేపట్టాల్సిన ఈ మిషన్ సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
చంద్రయాన్ -2 ప్రయోగం వీడియో
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జీఎస్ఎల్వీ ఎంకే3 వాహక నౌక నుంచి చంద్రయాన్-2 విడిపడి, భూకక్ష్యలోకి ప్రవేశించింది.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
జీఎస్ఎల్వీ పనితీరును మెరుగుపరచడం ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయగలిగామని శివన్ అన్నారు.
"ఈ రోజు చాలా చరిత్రాత్మకమైన రోజు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నా. చంద్రుడిపైకి భారత ప్రయాణానికి ఇది తొలి దశ. చంద్రుడిపై ఇంతవరకూ ఎవరూ పరిశోధించని ప్రాంతాలపై పరిశోధన జరిపే ఉద్దేశంతో చంద్రయాన్-2 ను ప్రయోగించాం.
చివరి నిమిషంలో చాలా జాగరూకతతో సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని గతంలో ఆపేశాం. 24గంటల్లో దాన్ని సరిచేసి, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగానికి సిద్ధమయ్యాం.
అహర్నిశలూ కష్టపడి పనిచేసే ఇస్రో సిబ్బంది, ఇంజనీర్లు, ఇతర విభాగాల సిబ్బంది కారణంగానే ఇది సాధ్యమైంది" అని శివన్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, iSRO
130 కోట్ల మంది సంకల్పం: మోదీ
చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
చరిత్రలో నిలిచిపోయే ప్రత్యేక క్షణాలివి.
శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా మన శాస్త్రవేత్తల సామర్థ్యం, 130 కోట్ల మంది సంకల్పాన్ని చాటిచెప్పాం.
ప్రతి భారతీయుడూ ఈరోజు ఎంతో గర్విస్తున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''చంద్రయాన్ 2 ప్రయోగం భారతీయులందరికీ గర్వకారణం. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చంద్రయాన్-2 వీడియో
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
చంద్రయాన్ -2ను నింగిలోకి ప్రయోగించినట్లు ఇస్రో తన ట్విటర్ ద్వారా ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
చంద్రయాన్ - 2
భారత్ తొలిసారిగా చంద్రుడి పైకి ఓ అంతరిక్ష నౌకను పంపేందుకు సిద్ధమైంది. చంద్రయాన్-2 విజయవంతమైతే, అంతరిక్ష కార్యక్రమాల్లో భారత్‌కు ఇది భారీ విజయమవుతుంది.
ఈ వాహకనౌక బరువు 2,379 కేజీలు. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైకి ఈ వాహక నౌక సెప్టెంబరులో చేరుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
జులై 21 ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
జులై 15న తెల్లవారుజామున 2:30 గంటలకు చేపట్టాల్సిన ఈ మిషన్‌ను సాంకేతిక సమస్యతో ప్రయోగానికి 56 నిమిషాల ముందు ఇస్రో నిలిపివేసింది. మళ్లీ ప్రయోగం ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
ప్రయోగాన్ని ఈ నెల 22న చేపడతామని 18న ఇస్రో ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష మిషన్ చంద్రయాన్-2.
చంద్రయాన్-2 విజయవంతమైతే చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
ఇప్పటివరకు అమెరికా, చైనా, ఒకప్పటి సోవియట్ యూనియన్ మాత్రమే ఈ ఘనతను సాధించాయి.

ఫొటో సోర్స్, EPA
చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు.
భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు.
గతంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి.
తాజా ప్రయోగం విజయవంతమైతే అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి, చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి అవకాశాలు పెరుగుతాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
చంద్రయాన్-1కు కొనసాగింపు
భారత్ 2008లో చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగానికి కొనసాగింపుగా చంద్రయాన్-2ను చేపడుతోంది.
అతి తక్కువ వ్యయంతో చంద్రయాన్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
నాటి కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి.
చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించినప్పటికీ 10 నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి.
అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.
ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
ఇవి కూడా చదవండి.
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- అపోలో11: ‘50 ఏళ్ల కిందట చంద్రుడిపై నడిచాను’
- అంబటి రాయుడు, అతడి '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఏమన్నారంటే...
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- కార్గిల్ యుద్ధం: భారత్ సిఫార్సుపై పాక్ సైనికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)