ప్రపంచ కప్: అంబటి రాయుడు, అతడి '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Twitter/@RayuduAmbati
క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టుకు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంలో ఎలాంటి పక్షపాతమూ లేదని సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. రాయుడి '3డీ' ట్వీట్‌పైనా ఆయన స్పందించారు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించేందుకు ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపిక చేసిన ఆటగాడు బాగా ఆడితే కమిటీ సంతోషిస్తుందని, అదే విధంగా ఎవరైనా ఎంపికకాని ఆటగాడు ఇలా (రాయుడు మాదిరి) భావోద్వేగంతో వ్యవహరిస్తే కమిటీ సభ్యులకూ బాధ కలుగుతుందని ప్రసాద్ తెలిపారు.
విజయ్ శంకర్, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌లలో ఎవరిని ఎందుకు తీసుకున్నామో మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని ఆయన వివరించారు. రాయుడిని ఎంపిక చేయకపోవడమనే నిర్ణయం అతడికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదన్నారు.
గతంలో రాయుడి ఎంపికకు సంబంధించిన అంశాన్ని ప్రసాద్ ప్రస్తావించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
"2017-18లో టీ20 మ్యాచుల్లో ప్రదర్శన ప్రాతిపదికగా రాయుడిని వన్డే జట్టులోకి తీసుకున్నాం. అప్పుడు మాపై చాలా విమర్శలు వచ్చాయి. రాయుడికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నందుకే ఎంపిక చేశాం. తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలో అతడు ఫెయిల్ అయితే ఎంపిక కమిటీ అండగా నిలిచింది. అతడికి నెల రోజులపాటు ఫిట్‌నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయించి ఫిట్‌నెస్ పరీక్షను అధిగమించి తిరిగి జట్టులోకి వచ్చేందుకు తోడ్పాటు అందించాం. జట్టులోకి వచ్చాక అతడికి మద్దతు ఇచ్చాం" అని ఆయన వివరించారు.
ప్రపంచ కప్ జట్టు కూర్పులో వివిధ కాంబినేషన్లు, సాధ్యాసాధ్యాల కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేకపోయామని ప్రసాద్ చెప్పారు.
ఇందులో కమిటీ లేదా వ్యక్తిగతంగా తాను ఒకరి పట్ల పక్షపాతంతో వ్యవహరించడమనేది లేనే లేదని, ఇది అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రాయుడికి వ్యతిరేకంగా తామేమీ చేయలేదన్నారు.
రాయుడు ఎంత ఉద్వేగంతో ఉన్నారో మాజీ క్రికెటర్లుగా తామూ అంతే ఉద్వేగంతో ఉన్నామని, అతడి బాధను అర్థం చేసుకుంటామని ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఆ ట్వీట్ అద్భుతం, నేను ఆస్వాదించా"
"నిజం చెబుతున్నా, ట్వీట్ చాలా బాగుంది. దానిని నేను ఆస్వాదించాను. చాలా సమయోచితంగా ఉంది. వ్యంగ్యంగా ఉంది. అద్భుతంగా ఉంది. అతడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు గానీ నేను ట్వీట్‌ను నిజంగా ఆస్వాదించా" అని బదులిచ్చారు.
ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడం, అతని స్థానంలో విజయ్ శంకర్‌కు అవకాశం రావడంపై రాయుడు అసంతృప్తికి గురయ్యాడు.
"చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్‌తో సహా చాలా మందిని ప్రయత్నించాం. రాయుడుకు చాలా అవకాశాలిచ్చాం. కానీ విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా మూడు విభాగాల్లో సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. పరిస్థితులు అనుకూలిస్తే, శంకర్ ఓ ఆల్‌రౌండర్ పాత్ర పోషించగలడు. నాలుగో స్థానంలో శంకర్‌ను ఆడించాలనుకుంటున్నాం" అని ప్రపంచ కప్ జట్టును ప్రకటించే సమయంలో ప్రసాద్ చెప్పారు. అదే సందర్భంలో విజయ్ శంకర్‌ను ‘3 డైమెన్షనల్ ప్లేయర్’గా పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని రాయుడు ఏప్రిల్ 16న ట్విటర్‌లో స్పందిస్తూ- "ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే కొత్త 3డీ కళ్లజోడుకు ఆర్డర్ పెట్టాను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ట్వీట్‌నే ప్రసాద్ సమయోచితంగా, అద్భుతంగా ఉందని చెప్పారు.
రాయుడు ఈ నెల 3న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి:
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు...
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఫిమేల్ వయాగ్రా ‘విలీజి’పై వివాదం.. ఎందుకు?
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








