థాయ్‌లాండ్: ప్రఖ్యాత 'మాయా బే' బీచ్ 2021 వరకూ మూసివేత

మాయా బే

ది బీచ్ సినిమాతో ప్రపంచ ఖ్యాతి పొందిన 'మాయా బే' బీచ్‌ను 2021 వరకూ మూసివేతను కొనసాగించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఫి ఫి లే దీవిలోని ఈ అందమైన తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరగటంతో అక్కడి పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే, గత ఏడాది ఈ బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

మాయా బే

ఫొటో సోర్స్, Getty Images

అప్పటికి ప్రతి రోజూ 5,000 మంది వరకూ పర్యాటకులు వస్తుండేవారు. జనం తాకిడితో బీచ్‌లోని కోరల్స్ (ప్రవాళ భిత్తికలు) చాలా వరకూ చనిపోయాయి.

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో నటించిన 2000 నాటి 'ది బీచ్' సినిమాతో మాయా బే బీచ్‌కు విపరీతమైన ప్రాచుర్యం లభించింది.

మాయా బే

మాయా బే జీవవారణం పునరుద్ధరణ కోసం బీచ్ సందర్శన మీద పర్యాటకుల నిషేధాన్ని రెండేళ్లు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.

గత ఏడాది బీచ్‌ను మూసివేసిన తర్వాత బ్లాక్‌టిప్ రీఫ్ షార్క్‌లు బీచ్ జలాల్లో ఈదుతుండటం కనిపించింది.

మాయా బే

ఈ బీచ్‌ను మళ్లీ తెరిచినపుడు సందర్శకుల సంఖ్యను పరిమితం చేస్తామని, తీర జలాల్లో బోట్లను నిషేధిస్తామని థాయ్‌లాండ్ జాతీయ పార్కుల విభాగానికి చెందిన థాన్ థామ్రాన్‌గ్నావాసావాత్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

మాయా బే

అయితే.. తాము ఈ బీచ్ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నామని స్థానిక టూరిస్ట్ ఆపరేటర్లు అంటున్నారు.

స్థానికులు జీవనోపాధి పొందటానికి వీలుగా ఈ బీచ్ మూసివేతపై ప్రజా దర్బారు నిర్వహించాలని స్థానిక టూరిజం అసోసియేషన్ అధ్యక్షుడు వటానా రెర్న్‌గ్సామట్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)