భయంకరమైన పీడకలలకు రూపం ఇస్తే... స్లీప్ పెరాలసిస్‌ను ఎదుర్కొంటున్న ఒక కళాకారుడి సృష్టి

నికోలస్ బ్రునో అనే ఒక కళాకారుడు ఏడేళ్ల వయసు నుంచే 'స్లీప్ పెరాలసిస్'తో బాధపడుతున్నారు. తను ఉన్న పరిస్థితిలో వచ్చే భయంకరమైన పీడకలల గురించి చెప్పడానికి ఆయన ఫొటోగ్రఫీని మార్గంగా ఎంచుకున్నారు.
ఆయన చేసిన ఆ ప్రయోగం తనకు వచ్చిన కలలను విశ్లేషించి వాటి అర్థం తెలుసుకోడానికి ఉపయోగపడింది.
మనం కలల నుంచి మేలుకున్నప్పుడు కలిగే అనుభూతి స్లీప్ పెరాలసిస్(నిద్రలో పక్షవాతం).
అప్పుడు మన శరీరం నిద్రపోతూనే ఉంటుంది. కానీ మనం మెలుకువలోనే కలలు కంటుంటాం.
మనం ఎందుకు కదలలేకపోతున్నామా అనే సందేహం వస్తుంది. అప్పుడే కలలు కనడం మొదలవుతుంది.
ఆ కలల్లో చాలా భయంకరమైన ఆకారాలు మన గదిలో తిరుగుతుంటాయి. ఇలాంటి జరుగుతాయని మనం ఎప్పుడూ అనుకోనివి మనకు తెలుస్తుంటాయి.
ఆరేళ్ల వయసులో తనకు తొలిసారి స్లీప్ పెరాలసిస్ వచ్చినట్లు గుర్తుందని నికోలస్ చెప్పారు.
"అప్పుడు మెలకువ వచ్చింది, కానీ కదల్లేకపోతున్నాను. ఒక ఆకారం నా గదిలోంచి వెళ్లడం చూస్తున్నాను. నాకు, 15 ఏళ్లప్పుడు దాదాపు ప్రతి రాత్రీ అలాంటి కలలే వచ్చేవి" అన్నారు.
నికోలస్ వాటి గురించి ఇంట్లో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ అవి విన్న అందరూ అతడికి దెయ్యం పట్టిందేమో అనుకున్నారు. ఇంటిని శుద్ధి చేయాలని కూడా అనుకున్నారు.
కానీ అతడిని అవి వదల్లేదు.
చివరకు వాటి గురించి ఎలా చెప్పాలో తెలీని వాళ్ల కోసం అతడు తన కళను ఉపయోగించాలనుకున్నాడు.
"కలలతో పోరాడకుండా, వాటిని వదిలించాలని అనుకోకుండా ఆ కలల అనుభవం పొందాలనుకున్నాను. ఎందుకంటే కలలు మళ్లీ మళ్లీ వస్తే, అవంటే భయం తగ్గిపోతుంది. కళ ద్వారా మనం వాటిపై దృష్టి పెట్టవచ్చు" అంటారు నికోలస్.
ఇవి కూడా చదవండి
- వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- ‘నిద్ర లేచాడు.. భార్యను మరచిపోయాడు’
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
- నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?
- నెల్లూరు: ‘ఆసుపత్రి బిల్లు కట్టలేకపోతే అవయవదానం చేయాలన్నారు.. కళ్లు, కిడ్నీలు తీసుకున్నారు’
- గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా....
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









