మైకేల్ జాక్సన్: ‘లీవింగ్ నెవర్‌లాండ్’తో పాప్ రారాజు లెగసీ మసకబారిందా? అతడి సంగీతం మూగబోతుందా? భవిష్యత్ తరాలు మరచిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెర్రీ విల్సన్
- హోదా, బీబీసీ న్యూస్‌బీట్ రిపోర్టర్
మైకేల్ జాక్సన్‌ను దశాబ్దాలుగా 'పాప్ రారాజు'గా పిలుచుకున్నారు. చరిత్రలో ప్రపంచ ప్రఖ్యాత సూపర్‌స్టార్‌లలో అతడు ఒకరు. కానీ జాక్సన్ లెగసీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా, బ్రిటన్‌లలో గత వారంలో టీవీలో ప్రసారమైన 'లీవింగ్ నెవర్‌లాండ్' అనే డాక్యుమెంటరీ దీనికి కారణం.
జేమ్స్ సేఫ్‌చుక్, వేడ్ రాబ్సన్‌లు తమ చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ తమపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ డాక్యుమెంటరీలో ఆరోపించారు.
ఈ ఆరోపణలను జాక్సన్ కుటుంబం తిరస్కరించింది. కానీ.. ఈ ఆరోపణలతో అతడి ప్రతిష్ట మీద చీకట్లు కమ్మకున్నాయి.
మరి.. జాక్సన్ లెగసీ మీద శాశ్వత మచ్చ పడిందా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
దోషా లేక నిర్దోషా?
ఆ డాక్యుమెంటరీలో చేసిన ఆరోపణలు చాలా మందిని కలత పెట్టిందనటంలో సందేహం లేదు.
ఆ ఇద్దరు వ్యక్తులు జాక్సన్‌తో తాము గడిపిన కాలం గురించి, తమపై అత్యాచారానికి సంబంధించి పూసగుచ్చినట్టు చెప్పిన వివరాలు చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
కానీ.. ఈ పాప్ సింగర్ దోషా, నిర్దోషా అనే దానిపై అటు సెలబ్రిటీలు, ఇటు ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు.
పాప్ రారాజును పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి (పీడోఫైల్) అని ఆ డాక్యుమెంటరీ తేల్చిందని కొందరు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ మరికొందరు జాక్సన్ నిర్దోషి అనే ఇంకా నమ్ముతూ అతడిని సమర్థిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎస్‌ఈఎంరష్ అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ మార్చి 6 - 8 తేదీల మధ్య #michaeljackson, #leavingneverland ట్యాగ్‌లు ఉపయోగించిన దాదాపు 3,000 ట్వీట్లను విశ్లేషించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ విశ్లేషణలో గుర్తించిన కొన్ని అంశాలివి:
'లీవింగ్ నెవర్‌లాండ్' ట్యాగ్ ఉపయోగించిన ట్వీట్లలో
- 33 శాతం (7,995) సానుకూల భాషను వాడారు
- 39 శాతం (9,252) తటస్థ భాషను వాడారు
- 27 శాతం (6,385) వ్యతిరేక భాషను వాడారు
'మైకేల్ జాక్సన్' ట్యాగ్ ఉపయోగించిన ట్వీట్లలో
- 37 శాతం (2,008) సానుకూల భాషను వాడారు
- 38 శాతం (2,048) తటస్థ భాషను వాడారు
- 24 శాతం (1,286) వ్యతిరేక భాషను వాడారు
జనం పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో చర్చించేలా 'లీవింగ్ నెవర్‌లాండ్' డాక్యుమెంటరీ కదిలించిందని ఎస్ఈఎంరష్ గ్లోబల్ మార్కెటింగ్ అధిపతి ఓల్గా ఆండ్రియెంకో పేర్కొన్నారు.
''అది ప్రసారమైన తర్వాత #michaeljackson హ్యాష్‌ట్యాగ్‌ను సమర్థిస్తున్న వారికన్నా మూడు రెట్లు ఎక్కువ మంది ఆ డాక్యుమెంటరీకి సానుకూలంగా స్పందించారు'' అని ఆమె వివరించారు.
అయితే.. ఆ డాక్యుమెంటరీలో వెల్లడైన అంశాలు మైకేల్ జాక్సన్ లెగసీ మీద ఎటువంటి శాశ్వత ప్రభావం చూపుతాయనేది ఇప్పుడే చెప్పలేమని రైట్ అనాలసిస్ అనే పీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు పాల్ బ్లాంచార్డ్ అభిప్రాయపడ్డారు.
''పాప్ సంగీతంలో బ్రెగ్జిట్ వంటిది ఇది. జనంలో ఇంతకుముందు కన్నా ఎక్కువగా చీలిక ఉంటుంది. ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువగా జనంలో చీలిక ఉంటుంది'' అని ఆయన విశ్లేషించారు.
''జాక్సన్‌ను తిరస్కరించటం ప్రారంభించిన వారిలో.. ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది. జాక్స్ బ్లాక్‌మెయిల్ బాధితుడని భావిస్తున్న వారు ఆ విషయాన్ని మరింత బలంగా నమ్ముతారు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జాక్సన్ కుటుంబం ఏం చెప్పంది?
మైకేల్ జాక్సన్ మీద చేసిన ఆరోపణలను ఆయన కుటుంబం తీవ్రంగా ఖండించింది. పాప్ గాయకుడి సంపద నుంచి డబ్బులు పిండుకోవటానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టింది.
జాక్సన్ ఈ ఆరోపణలను వింటే ''విలపించేవాడ''ని అతడి మేనల్లుడు తాజ్ జాక్సన్.. న్యూస్‌బీట్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
అయితే.. జాక్సన్ తల్లి, సోదరి జానెట్ జాక్సన్ వంటి ప్రముఖులు ఈ ఆరోపణల మీద ఇంకా స్పందించలేదు.
ఈ డాక్యుమెంటరీ ప్రసారమైనప్పటి నుంచీ జాక్సన్ కుమార్తె పారిస్ పెద్దగా బయటకు రాలేదు. ఈ విషయం గురించి నేరుగా మాట్లాడలేదు.
అయితే.. తన అభిమానులను శాంతంగా ఉండాలని చెప్తూ ఆమె గురువారం నాడు ఒక ట్వీట్ చేశారు. ''నా జీవితం గురించి నా కన్నా మీరందరూ సీరియస్‌గా పట్టించుకుంటున్నారు'' అని అందులో వ్యాఖ్యానించారు.
''అన్యాయాలు చాలా నిస్పృహ కలిగిస్తాయని నాకు తెలుసు. కోపావేశాలు సులభంగా వస్తాయి. కానీ ఆగ్రహావేశాలతో వ్యవహరించటం కన్నా శాంతియుత ఆలోచనతో స్పందించటం మరింత హేతుబద్ధంగా ఉంటుంది. పైగా ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండటం మంచిది'' అని కూడా ఆమె పేర్కొన్నారు.
అమెరికాలో ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన హెచ్‌బీఓ మీద 100 మిలియన్ డాలర్లకు మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ దావా వేస్తోంది. ఒక పాత కాంట్రాక్టులో ఉన్న అగౌరవప్రదంగా వ్యవహరించరాదన్న నిబంధనను హెచ్‌బీఓ ఉల్లంఘించిందన్నది జాక్సన్ ఎస్టేట్ వాదన.

ఫొటో సోర్స్, Getty Images
జాక్సన్ సంగీతం మూగబోతుందా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా సహా - ప్రపంచ వ్యాప్తంగా పలు రేడియో స్టేషన్లు మైకేల్ జాక్సన్ సంగీతాన్ని ప్రసారం చేయటం నిలిపివేశాయి.
శ్రోతలను బట్టి తమ సంస్థ నడుస్తుందని.. ''జాగ్రత్తగా నడుచుకోవాలన్నది తమ అభిప్రాయ''మని న్యూజిలాండ్‌లో తొమ్మిది రేడియో స్టేషన్ల యజమాని అయిన మీడియావర్క్స్ సంస్థ అధిపతి లియాన్ రాట్ పేర్కొన్నారు.
కానీ బ్రిటన్‌లో రేడియో స్టేషన్లు ఇటువంటి విధానం అనుసరించటం లేదు.
కళాకారులను తాము నిషేధించబోమని.. తమ రేడియో స్టేషన్లలో మైకేల్ జాక్సన్ సంగీతం ప్రసారం కావచ్చునని బీబీసీ పేర్కొంది.
''మేం ప్రతి సంగీతాన్నీ దాని యోగ్యతలను బట్టి పరిగణనలోకి తీసుకుంటాం. వివిధ నెట్‌వర్క్‌లలో మేం ఏ సంగీతం ప్రసారం చేస్తామనేది.. సంబంధిత శ్రోతలను, ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది'' అని బీబీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
అయితే.. ఆ డాక్యుమెంటరీని చూశాక తాను తన ఐఫోన్‌లో ఉన్న 15 మైకేల్ జాక్సన్ పాటలను తొలగించానని బీబీసీ మస్ట్ వాచ్ పాడ్‌కాస్ట్ నిర్వాహకుడు స్కాట్ బ్రియాన్ చెప్పారు.
కానీ.. మైకేల్ జాక్సన్ పాటలను జనం ఇంకా వినాలన్నదే తన అభిప్రాయమని రేడియో 1 శ్రోత క్రిస్టియన్ (26) పేర్కొన్నారు.
''అతడు పాప్ రారాజు. మైకేల్ జాక్సన్‌ని తమ రోల్ మోడల్‌గా ఎంత మంది మ్యుజీషియన్లు భావించారో ఊహించలేం'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
జాక్సన్ సాంస్కృతిక లెగసీ చెరిగిపోతుందా?
మైకేల్ జాక్సన్ స్వరంతో కూడిన ఒక ఎపిసోడ్‌ను ద సింప్సన్ సంస్థ తన ప్రాసారాలు, చానళ్ల నుంచి తొలగిస్తోంది.
1991లో మొదటిసారి ప్రసారమైన ఒక కార్యక్రమంలో.. ఒక మానసిక చికిత్స వైద్యశాలలో హోమర్‌ను కలిసే లియాన్ కాంపోవ్‌స్కీ అనే పాత్రకు జాక్సన్ గళం అందించారు. ఈ కార్యక్రమాన్ని సింప్సన్ తొలగిస్తోంది.
''ఇదే ఏకైక మార్గంగా స్పష్టంగా కనిపిస్తోంది'' అని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జేమ్స్ ఎల్ బ్రూక్స్ తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికతో పేర్కొన్నారు.
బ్రిటన్‌లోని నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియంలో గల మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
మైకేల్ జాక్సన్ సంగీతం చుట్టూ కేంద్రీకృతమైన థ్రిల్లర్ లైవ్ అనే సంగీత కార్యక్రమం పదేళ్లుగా కొనసాగుతోంది. దీని మీద ఈ డాక్యుమెంటరీ ప్రభావం ఏమైనా ఉందా అనేదానిపై వ్యాఖ్యానించేందుకు సదరు సంస్థ తిరస్కరించింది.
మైకేల్ జాక్సన్ మీద ఆరపణలు ''బాధాకరం'' అని తాజ్ జాక్సన్ న్యూస్‌బీట్‌తో పేర్కొన్నారు. అయితే.. జాక్సన్ లెగసీ మీద ఈ ఆరోపణలు శాశ్వత ప్రభావం చూపబోవని, ఇది తాత్కాలికమేనని, నిజం వెలుగుచూస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
అయితే.. ''జాక్సన్ తనను సమర్థించుకోవటానికి ఈ ప్రపంచంలో లేరు. ఆయన కుటుంబం ఆయనను బలంగా సమర్థించుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో దీర్ఘ కాలంలో జాక్సన్ పేరుని ఈ డాక్యుమెంటరీ ధ్వంసం చేస్తుంది. భవిష్యత్తు తరాలు మైకేల్ జాక్సన్‌ను మరచిపోతాయి'' అని పీఆర్ నిపుణుడు, 10 ఎటిస్ మేనేజింగ్ ఎడిటర్ ఆండీ బార్ అభిప్రాయపడ్డారు.
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- ఇరాన్: డ్యాన్స్ చేయటానికి ఎన్నో కష్టాలు.. దాడులు, అరెస్టులు
- ఇరాన్: డాన్స్ చేసిన యువతి అరెస్ట్ - నృత్యాలతో మహిళల నిరసన
- కూచిపూడిని సినిమాలో చూసి.. సాధన చేస్తున్న పోలండ్ యువతులు
- 'మేం సెక్స్ అమ్మేవాళ్లం కాదు.. కళాకారులం!'
- చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్పై ప్రశ్నలు
- లైంగిక దాడుల బాధితులకు క్షమాపణ చెప్తాం: ఆస్ట్రేలియా
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








