#బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ ఏకాకి అయ్యిందా

ఫొటో సోర్స్, RAVEESH KUMAR @TWITTER
పాకిస్తాన్ బాలాకోట్‌లో భారత విమానాల దాడి తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దాడుల లక్ష్యం జైషే మహమ్మద్ స్థావరాలను ద్వంసం చేయడమే అని చెప్పారు.
"తీవ్రవాదంతో పోరాటం అనేది భారత్‌కు అతి ముఖ్యమైన అంశం. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో 40 మంది మా జవాన్లు మృతి చెందారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ దాడి మనకు చెబుతోంది" అని సుష్మా స్వరాజ్ తెలిపారు.
పాకిస్తాన్ ఈ దాడి గురించి ఎలాంటి సమాచారం అందించలేమని చెప్పడంతో భారత ప్రభుత్వం దాడి చేయాలని నిర్ణయించినట్టు సుష్మ చెప్పారు.
"భారత్ ఏ సైనిక స్థావరాలపైన, పౌరుల నివాసాలపై దాడులు చేయలేదు" అన్నారు.
భారత్, చైనా, రష్యా విదేశీ మంత్రుల త్రైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి సుష్మా స్వరాజ్ చైనాలోని వూజెన్ వెళ్లారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రెండు దేశాలూ దూకుడు చూపద్దు-అమెరికా
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రయత్నించాలని పాకిస్తాన్‌ను కోరుతామని అమెరికా ఒక ప్రకటన జారీ చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో "భారత్ ఫిబ్రవరి 26న తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టిన తర్వాత నేను భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడాను. భారత్‌తో మాకు సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. మేం ఆ ప్రాంత భద్రతను కోరుకుంటున్నాం. అక్కడ శాంతి ఉండాలని భావిస్తున్నాం" అన్నారు
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీతో కూడా తను మాట్లాడానని పాంపియో చెప్పారు.
"తమ భూభాగంలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని పాకిస్తాన్‌కు గట్టిగా చెప్పామని" తెలిపారు.
"రెండు దేశాలూ ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా ఉండాలని" ఆయన కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాక్ తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం ఆపాలి-ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడికి వ్యతిరేకంగా భారత్ పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసిందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరిస్ పేన్ "పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే. దానితోపాటు తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం పాకిస్తాన్ మానుకోవాలి. వారు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా చేయాలి" అన్నారు.
"ఈ చర్యలు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గించడానికి తోడ్పడుతాయని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అన్నారు.
అయితే రెండు దేశాల శాంతి ప్రయత్నాలు చేయాలని, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆస్ట్రేలియా సూచించింది.

ఫొటో సోర్స్, FOREIGNMINISTER.GOV.AU
భారత్, పాక్ బంధం మెరుగుపడితే మంచిది-చైనా
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూకాంగ్ "భారత్, పాకిస్తాన్ రెండూ దక్షిణాసియాలో ముఖ్యమైన రెండు దేశాలని, పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై రెండూ దృష్టి పెట్టాలని" కోరారు.
మీడియాతో మాట్లాడిన ఆయన "రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి చాలా అవసరం. అది రెండు దేశాలకు చాలా ముఖ్యం. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముందుకు వెళ్లవని తాము భావిస్తున్నామని" తెలిపారు.

ఫొటో సోర్స్, WWW.FMPRC.GOV.CN
"తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సమస్య. దీనిని అంతం చేయడానికి రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని లూకాంగ్ అన్నారు.
"బాలాకోట్ దాడుల తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారని, చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవచ్చని చైనా భావిస్తున్నట్లు" లూకాంగ్ చెప్పారు.
ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ "సరిహద్దులు దాటి దాడులు చేస్తున్న తీవ్రవాదులతో పోరాడేందుకు భారత్‌కు హక్కు ఉందని మేం భావిస్తున్నాం. ఈ విషయంలో మేం భారత్‌కు అండగా ఉంటాం" అని తెలిపింది.
"సరిహద్దుల లోపల నడుస్తున్న తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిషేదం విధించాలని" ఫ్రాన్స్ పాకిస్తాన్‌ను హెచ్చరించింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఫెడెరికా మోఘెర్నీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడామని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు జరిపామని తెలిపింది.
"తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న తీవ్రవాద సంస్థలతోపాటు, దాడులకు బాధ్యులమని ప్రకటించే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని" ఆయన చెప్పారు.
ఇటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ మాత్రం పాకిస్తాన్ సరిహద్దును ఉల్లంఘించినందుకు భారత్‌ను విమర్శించింది. రెండు దేశాలు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది.
రెండు దేశాలు బల ప్రదర్శనకు దిగకుండా ఉండాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ కోరింది. ఆ ప్రాంతంలో శాంతికి భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ దిగవద్దని చెప్పింది.
ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాడి ముజఫరాబాద్ సెక్టార్‌లో కొంత దూరం లోపలవరకూ వెళ్లి వచ్చాయి. అక్కడ బాంబులు వేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








