నోకియా 9 ప్యూర్‌వ్యూ: ఐదు కెమెరాలతో ఫొటో తీసే స్మార్ట్ ఫోన్

- రచయిత, లియో కెలయన్
- హోదా, టెక్నాలజీ డెస్క్ ఎడిటర్, బీబీసీ
వెనుక భాగంలో ఐదు కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్‌ను నోకియా కంపెనీ తీసుకొచ్చింది. ‘‘అద్భుతమైన చిత్రాలను తీయగల’’ సామర్థ్యం దీనికి ఉందని, ఈ ఐదు కెమెరాలూ ఒకేసారి ఫొటో తీస్తాయని నోకియా చెబుతోంది.
ఫొటో తీసేప్పుడు హైలైట్స్‌ను, నీడల్ని దాచుకుని, డెప్త్ ఆఫ్ ఫోకస్ ఎడిట్స్‌కు మరింత సామర్థ్యం కల్పించడం ఈ ఫోన్ ప్రత్యేకత అని, మిగతా ఫోన్లలోని కెమెరాలకు ఇవి లేవని కంపెనీ అంటోంది.
ఈ ఫోన్ 240 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో ఫొటోలు తీయగలదని వివరిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్.. ప్రస్తుత మార్కెట్‌కు సవాల్ విసురుతుందని నిపుణులు చెబుతున్నారు.
నోకియా పేరుతో ఇది మార్కెట్లోకి వస్తున్నప్పటికీ.. ఈ ఫోన్లను తయారు చేసింది మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్. 2016వ సంవత్సరం నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తోంది.
ఐడీసీ ప్రకారం - 2018 సంవత్సరం చివరి మూడు నెలల్లో ఈ సంస్థ యూకేలో 3.3శాతం మార్కెట్ వాటాతో, యాపిల్, శాంసంగ్, హువాయ్‌ల తర్వాత స్థానంలో నిలిచింది.

బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షో ప్రారంభానికి ముందు విడుదలైన ఈ నోకియా 9 ప్యూర్‌వ్యూ ధర 699 డాలర్లు (దాదాపు రూ.49500).
నోకియా 9కు అమర్చిన 5 కెమెరాలూ ఒక్కోటి 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్నవి. వీటికున్న ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వల్ల ఫొటోల్లోని సమాచారం స్పష్టంగా ఉంటుంది.
వీటిలోని రెండు కెమెరాలు RGB సెన్సార్ ద్వారా రంగులను తీసుకుంటాయి.
మిగిలిన మూడూ మోనోక్రోమ్ కెమెరాలు, ఇవి అందుబాటులో ఉన్న కాంతికి మూడురెట్ల కాంతిని గ్రహిస్తాయి.
దీనివల్ల ఎలాంటి ఫిల్టర్లూ అవసరం లేకుండానే వివిధ వేవ్‌లెంత్‌ల వద్ద కెమెరాను ఆపరేట్ చేయవచ్చు.

ఈ ఫీచర్లన్నీ సాధారణ డిజిటల్ కెమెరాల్లో కూడా ఉండవని, అదే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని హెచ్ఎండీ తెలిపింది.
మరింత ఖరీదైన లెన్స్, పెద్ద సెన్సార్ వాడితే వచ్చే ఎఫెక్ట్‌ను నోకియా 9 కెమెరాలతో పొందవచ్చు.
లైట్ అనే ఓ సిలికాన్ వ్యాలీ స్టార్టప్ 2017లో విడుదల చేసిన ఎల్16 సాంకేతికత ఆధారంగా ఈ మల్టీ కెమెరా సెట్ అప్‌ను ఏర్పాటు చేశారు.
ఓ డీఎస్ఎల్ఆర్‌తో కలిగే ప్రయోజనాలన్నీ 16 కెమెరాల సెట్ అప్‌తో తక్కువ ధరలోనే లభించే ఏర్పాటే ఈ ఎల్16.

ఫొటో సోర్స్, Light
ఇవి కూడా చదవండి:
- స్మార్ట్ వే: ఈ రోడ్డు స్మార్ట్‌ఫోన్ వాడేవారికి మాత్రమే..!
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- మీ కంప్యూటర్ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుసా?
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
- స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
- హువాయ్: జాతీయ భద్రత భయంతో చైనా సంస్థపై ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ‘నిషేధం’
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- ‘స్మార్ట్ ఫోన్ వాడితే క్రీస్తు విరోధి పుట్టుకొస్తాడు జాగ్రత్త’ - రష్యా క్రైస్తవ మతాధికారి హెచ్చరిక
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
- క్రికెట్: భారత్ కొంప ముంచింది ఉమేశ్ యాదవ్ బౌలింగా? ధోనీ స్లో బ్యాటింగా?
- టెన్త్, ఇంటర్, డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... రైల్వే శాఖలో 1,30,000 పోస్టుల భర్తీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








