ఢాకాలో అగ్ని ప్రమాదం: 78 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 78 మంది మృతి చెందారు. రసాయన పదార్థాలున్న గోదాములో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రసాయన గోదాం ఉన్న నివాస గృహాల మధ్య బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయిని, అవి చుట్టుపక్కల భవంతులకు వ్యాపించాయని స్థానిక మీడియా తెలిపింది.
మంటలను అదపు చేశామని, ఈ ప్రమాదంలో 78 మంది చనిపోయారని అధికారులు గురువారం ఉదయం బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
గ్యాస్ సిలిండర్ లీకవడంతో అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక ముఖ్య అధికారి అలీ అహ్మద్ ఏఎఫ్‌పీకి తెలిపారు.
రసాయన గోదాంలున్న నలుదిక్కులకు మంటలు వ్యాపించాయని ఆయన చెప్పారు.
'' అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ట్రాఫిక్ జాం అయింది. మంటలు వేగంగా వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు'' అని ఆయన వివరించారు.
చౌక్ బజార్ గురించి...
పాత ఢాకాలో ముఖ్యమైన ప్రాంతాల్లో చౌక్‌బజార్ ఒకటి. ఇది ఓ చారిత్రాత్మక ప్రదేశం. 300 ఏళ్ల కిందట మొఘల్ పాలనలో ఉన్నప్పుడు బురిగంగా నది ఒడ్డున దీన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల కిందట వరకూ దేశ రాజధాని ఢాకా కేంద్రప్రాంతంలో ఒకటిగా ఉండేది.
అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఢాకా మరింత విస్తరించింది. అయినప్పటికీ పాత ఢాకాలోని ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
అయితే, ఢాకాలోని సదర్ ఘాట్, శంకరీ బజార్, చౌక్ బజార్, లాల్ బాగ్‌లు భిన్నమైన చారిత్రక కారణాలు, వాణిజ్య కార్యకలాపాలతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఫొటో సోర్స్, Reutrs
పాత ఢాకాలోని చౌక్ బజార్ రసాయన వ్యాపారాలకు కేంద్రగా ఉంది. 2010లో ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా ఉన్న అత్తరు పరిశ్రమలను, రసాయన గోదాంలను ప్రభుత్వం నిషేధించింది.
ఇరుకైనా సందులతో ఈ ప్రాంతం ఉంటుంది. కొన్ని చోట్లకు బస్సు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆటోరిక్షాలు, చిన్న కార్లు, పాదచారులతో ఇరుకైనా రోడ్లు నిండిపోయి ఉంటాయి.
ఇక రోడ్లపై నుంచి తలెత్తి చూస్తే విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ కేబుల్స్ చిక్కులుచిక్కులుగా కనిపిస్తాయి. వీటి నుంచి కూడా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.
ఇక్కడి నివాస గృహాలనే వాణిజ్య సముదాయాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్‌ను రసాయనాలు, గ్యాస్ సిలిండర్‌లను నిల్వ ఉంచే గోదాంగా వాడుతున్నారు. జనసాంద్రత అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో హోటళ్లు కూడా ఎక్కువే.
భిన్న రుచులున్న సంప్రదాయ ఆహారపదార్థాలకు చౌక్ బజార్ కూడా పెట్టింది పేరు. కబాబ్, బిర్యానీ తినడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులకు ఈ ప్రాంతంగా కేంద్రగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్‌డే ముందు రోజు..
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








