యూట్యూబర్ బాబీ బర్న్స్: ఇంటర్నెట్ మానసిక సంక్షోభానికి ముఖచిత్రం.

ఇంటర్నెట్‌లో ఏవో మబ్బులు ముసురుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభావవంతులు చాలా మంది గత ఏడాది కాలంగా.. తమ వేదికల మీద ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు. ఆన్‌లైన్‌లో మానసిక ఆందోళన సంక్షోభం తలెత్తుతోందా? అది నిజమైతే, ఎందుకు అలా జరుగుతోంది?
బాబీ యూట్యూబ్ వీడియోలకు 10 కోట్ల కన్నా ఎక్కువ వీక్షణలు లభించాయి. మానసికంగా చిత్తు చేసే ప్రతికూల కామెంట్లు తరచుగా వస్తున్నా కానీ ఈ పని ఆపలేనంత వ్యసనంగా మారిందని ఆయన అంటున్నారు.
వేలాది మంది నుంచి అవమానాలు ఎదుర్కోవటం ఎలా ఉంటుంది?
లాస్ ఏంజెలెస్ నివాసి బాబీ బర్న్స్... 11 ఏళ్లుగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ‘‘ఇంటర్నెట్ ఒత్తిడికి నేనొక ముఖచిత్రం లాంటివాడిని...’’ అని ఆయన స్వయంగా చెబుతున్నారు.
బాబీ వీడియోలకు 10 కోట్లకు పైగా వ్యూలు ఉన్నాయి. ఇవి వేలాది డాలర్లు ఆర్జించాయి. ఓ 900 నుంచి 1,000 వీడియోలు పోస్ట్ చేసి ఉంటానని బాబీ పేర్కొన్నారు.
బాబీ వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తారు. కానీ చాలా మంది ఆయనకు తిట్లు పంపిస్తారు. 'బాబీ అనే పేరుతో ఓ దద్దమ్మలా ఉండటం గురించి ఊహించండి', 'బాబీ నువ్వు బాగానే ఉన్నావా? వెర్రోడిలాగా కనిపిస్తున్నావు' వంటివి కొన్ని ఉదాహరణలు.

‘ఇది నీకు నిజంగా చేటు చేస్తుందనే ఆందోళన నీకు కలగదా?’ అనంటే, ‘‘ఇది నాకు మంచిది కాదని నాకు తెలుసు. దీనితో నేను సరిగా వ్యవహరిస్తున్నానని అనుకోను’’ అని ఆయన సమాధానం చెప్పారు.
‘‘ఇది మన వ్యక్తిత్వం మీద జనం తీర్పు చెప్పటానికి ఇంటర్నెట్‌లో పెట్టటమే. మనం ఓ నకిలీ వ్యక్తిత్వాన్ని సృష్టిస్తున్నాం. అది మనమేనని జనం అనుకునేలా చేస్తున్నాం’’ అని బాబీ వ్యాఖ్యానించారు.
అయితే.. ‘‘ఓ ప్రేక్షకుడిని నిరాశపరిచానన్న భావన చాలా నిస్పృహ కలిగిస్తుంది. అది మన మానసిక ఆరోగ్యం మీద నిజంగా ప్రభావం చూపుతుంది. ఒక పోస్టు ద్వారా మనకు వచ్చే ఆమోదాన్ని అర్థం చేసుకుంటే... ఆ ఆమోదం లోపిస్తే.. అది మరేదీ పూడ్చలేని ఓ అగాధం లాగా ఉంటుంది. ఎందుకంటే అది ఓ వ్యసనం’’ అని చెప్పారాయన.
ఇవి కూడా చదవండి:
- #Youtubeshooting: యూట్యూబ్‌పై ఆమెకెందుకు అంత కోపం?
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- FACT CHECK: ఆస్ట్రేలియా బీరు సీసాలపై హిందూ దేవుళ్ళ బొమ్మలు
- ఇస్లాంను మార్చేస్తున్న చైనా.. ఇందుకోసం పంచవర్ష ప్రణాళిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










