#Youtubeshooting: యూట్యూబ్‌పై ఆమెకెందుకు అంత కోపం?

ఫొటో సోర్స్, NASIM AGHDAM
తాజాగా అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు తెగబడ్డారు. ఆమె పేరు నసీం అగ్దాం అని స్థానిక మీడియా వెల్లడించింది.
39 ఏళ్ల ఈ మహిళ కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ఈమె ఇరాన్ సంతతి మహిళని సమాచారం.
ఈమె తరచూ యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంటారు. పలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు.
ఇటీవల ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో యూట్యూబ్‌ను తీవ్రంగా విమర్శించారు.
అకారణంగా.. తన పోస్టులను ఫిల్టర్ చేసి.. తన వీడియోలకు వీక్షణలు పెరగకుండా చేస్తున్నారని ఆరోపించారు.
తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లోనూ యూట్యూబ్ పై పలు విమర్శలు చేశారు
తాజా ఘటనతో యూట్యూబ్ ఆమె ఖాతాను తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను కూడా తీసేశారు.
ఆమె వ్యక్తిగత సైట్‌ను పరిశీలించినపుడు యూట్యూబ్‌పై పలు విమర్శలు చేసిన పోస్టులు కనిపించాయి.
యూట్యూబ్‌లో సమాన వృద్ధి అవకాశాలు లేవు. అని అందులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
కాల్పుల అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈమె పేరు నసీం అగ్దాం అని స్థానిక మీడియా వెల్లడించింది.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడు కాల్పులు జరిపిన మహిళకు ప్రియుడై ఉంటారని సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
ఈయనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









