కాలిఫోర్నియా కార్చిచ్చు: 42 మంది మృతి.. ఇళ్లు ఖాళీ చేసిన లేడీ గాగా, కిమ్ కర్దాషియన్

ఫొటో సోర్స్, Inpho
అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చులో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 228 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
మంటల్లో దాదాపు 7,200 భవనాలు కాలిపోయాయి. మరో 15,500 నివాసాలకు ప్రమాదం పొంచి ఉంది.
ఇళ్లు కోల్పోయిన వారిలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. హాలివుడ్ సినిమా 'త్రీ హండ్రెడ్'తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెరార్డ్ బట్లర్ నివాసం పాక్షికంగా కాలిపోయింది. అమెరికన్ గాయని మిల్లీ సైరస్ ఇల్లు కాలిబూడిదయ్యింది.
అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, గాయని లేడీ గాగా సహా పలువురు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
1933 తర్వాత ఇంత విధ్వంసకరంగా కార్చిచ్చు చెలరేగడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. 1933లో ఇదే కాలిఫోర్నియాలో కార్చిచ్చు వల్ల 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షల ఎకరాల అడవి కాలిబూడిదయ్యింది.
గాలి వేగంతో వీయడంతో కొన్ని కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ కార్లలో కొందరి శవాలు కనిపించాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అధ్యక్షుడు ట్రంప్ దీన్ని మహా విపత్తుగా ప్రకటించి తమను ఆదుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన కార్చిచ్చుతో ఇక్కడి ప్రకృతి అందాలన్నీ హరించుకు పోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లు వదలి పారిపోయారు. కుటుంబ సభ్యులు చెల్లాచెదురయ్యారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
"నా ఇద్దరు కొడుకులు, వాళ్ల పిల్లల ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. నేను చీకోలో ఓ శిబిరంలో ఉంటున్నాను. వారు ఇక్కడ లేరు. వారిని తప్పకుండా కలుసుకుంటానని ఆశిస్తున్నా" అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 2,50,000 మంది ఇళ్లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికాలో ఈ ఏడాది మంటల వల్ల బెల్జియం, లగ్జంబర్గ్ దేశాల మొత్తం విస్తీర్ణం కంటే ఎక్కువ భూభాగం కాలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎంతో భయానక ఘటన అని, రాబోయే 20 ఏళ్లలో కూడా ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరగొచ్చని కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో చాలా కాలం తరువాత ఎడారి గాలులు భారీగా వీస్తున్నాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి అదే ప్రధాన కారణం. మరింత మంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో దీన్ని మహా విపత్తుగా ప్రకటించాలని అధ్యక్షుడు ట్రంప్‌ని గవర్నర్ కోరారు.
ఇవి కూడా చదవండి:
- మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాలు ఎందుకు వృథా అయ్యాయి?
- తెలంగాణ ఎన్నికలు: 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
- ఆంగ్ సాన్ సూచీకి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకున్న ఆమ్నెస్టీ
- ఇజ్రాయెల్-గాజా: మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ - బీబీసీ తాజా పరిశోధనలో వెల్లడి
- ‘ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - మాడభూషి శ్రీధరాచార్యులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









