ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి, వేళ్ల పొడవుకు సంబంధం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
ఎడమ చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య వ్యత్యాసం ఉండే మహిళలు స్వలింగ సంపర్కులు అయ్యుండే అవకాశం ఎక్కువని ఒక అధ్యయనం తెలిపింది.
ఒకేలా ఉండే 18 ఆడ కవల జంటల(36 మంది)పై బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ప్రతి జంటలో ఒకరు స్ట్రైట్ కాగా, మరొకరు హోమో సెక్సువల్.
సగటు ప్రకారం చూస్తే- ఈ జంటల్లో స్వలింగ సంపర్కులైన మహిళల ఎడమ చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలు(నాలుగో వేలు) పొడవు మధ్య వ్యత్యాసం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
14 మగ కవల జంటల(28 మంది)పైనా పరిశోధకులు అధ్యయనం జరిపారు. ప్రతి జంటలో ఒకరు స్ట్రైట్ కాగా, మరొకరు స్వలింగ సంపర్కులు. వీరిలో చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య తేడాకు, లైంగికతకు మధ్య సంబంధం కనిపించలేదు.
సాధారణంగా మహిళల్లో ఈ రెండు వేళ్ల పొడవు దాదాపు సమానంగా ఉంటుంది. పురుషుల్లో రెండింటి పొడవు మధ్య గణనీయమైన తేడా ఉంటుంది.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పురుష హార్మోన్‌గా పిలిచే టెస్టోస్టిరాన్ ప్రభావానికి ఎక్కువగా లోనవడం వల్ల చూపుడు వేలు, ఉంగరపు వేలు పొడవు మధ్య వ్యత్యాసం ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.
తల్లి కడుపులో ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ ప్రభావానికి అందరూ లోనవుతారని, అయితే కొందరు ఈ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని వారు తెలిపారు.
కవలలు ఒకేలా ఉన్నా వారిద్దరి లైంగికత భిన్నంగా ఉండొచ్చని, జన్యువులే కాకుండా ఇతర అంశాలు ఇందుకు కారణం కావొచ్చని ఎసెక్స్ విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన అధ్యయనకర్త డాక్టర్ ట్యూస్‌డే వాట్స్ చెప్పారు.
''లైంగికత తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్ణయమవుతుందని, టెస్టోస్టిరాన్ స్థాయి, ఈ హార్మోన్‌కు శరీరం స్పందించే విధానాన్ని బట్టి ఇది ఉంటుందని మా పరిశోధన చెబుతోంది. అధిక స్థాయిలో టెస్టోస్టిరాన్ ప్రభావానికి లోనయ్యేవారు హోమోసెక్సువల్ లేదా బైసెక్సువల్ అయ్యే అవకాశముంది'' అని ట్యూస్‌డే వాట్స్ వివరించారు.
అధ్యయనం వివరాలు 'ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్'లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- స్వలింగ సంపర్కం నేరం కాదు: సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బిలియనీర్స్... ఏ దేశంలో ఎందరున్నారు?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?
- ఆన్లైన్ షాపింగ్: వ్యాపారుల నకిలీ రివ్యూలు.. పూర్తిగా నమ్మితే అంతే సంగతులు
- సౌదీ అరేబియా: పాశ్చాత్య దేశాలకు ఎందుకంత ముఖ్యం?
- అమృత్సర్ విషాదం: రైల్వే ట్రాక్ మీద పోగొట్టుకున్న బిడ్డను కలిసిన తల్లి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








