ఆన్‌లైన్ షాపింగ్: వ్యాపారుల నకిలీ రివ్యూలు.. పూర్తిగా నమ్మితే అంతే సంగతులు

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే అమ్మకందార్లు, తమ ఉత్పత్తులు బాగున్నాయంటూ రివ్యూలు రాసేవారికి.. బదులుగా కొన్ని వస్తువులను ఉచితంగా ఇస్తున్నట్లు 'విచ్?' సంస్థ చేసిన ఒక దర్యాప్తులో వెల్లడైంది.
ఇలా నకిలీ రివ్యూలు రాసేవారు ఫేస్‌బుక్, అమెజాన్‌ల నియమనిబంధనలను మీరినట్టే అవుతుంది. నకిలీ రివ్యూల వ్యాపారాన్ని 'బీబీసీ-5 లైవ్' కూడా వెలుగులోకి తెచ్చింది.
అమెజాన్ ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్న 5మంది అమ్మకందార్లు.. తమ ఉత్పత్తులకు రిఫండ్ అవకాశం ఉందని రివ్యూలు రాసి, లింక్‌ను షేర్ చేయాలని సూచిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విచ్? సంస్థకు చెందిన వ్యక్తి, నిజాయితీగా తన రివ్యూను రాసినందుకుగాను ఐదుసార్లలో కేవలం మూడుసార్లే తన డబ్బును రిఫండ్ చేశారు. మరోవైపు ఆవ్యాపారులు తనకు అందుబాటులోకి రాలేదు.
దర్యాప్తులోని అంశాలను వివరిస్తూ, ఒక స్మార్ట్ వాచ్ ఉత్పత్తికి సంబంధించి తమ వ్యక్తి 'టూ-స్టార్' రేటింగ్ ఇచ్చారని, కానీ ఆ వస్తువును ఉచితంగా ఇస్తున్నందుకు తన రివ్యూలో రేటింగ్ పెంచాలని అమ్మకందార్లు ఆఫర్ కోరినట్లు విచ్? సంస్థ తెలిపింది.
మరొక సందర్భాన్ని వివరిస్తూ, తాము ఆన్‌లైన్‌లో ఒక వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ కొన్నాక, దాన్ని రిఫండ్ చేయాలని కోరినపుడు.. ''మా ఉత్పత్తికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తూ మీ ఫోటోను కూడా పంపండి. అప్పుడు మేం రిఫండ్ చేస్తాం'' అని సదరు అమ్మకందారు తమను కోరారు.
కానీ ఆ ఉత్పత్తికి ఫైవ్ స్టార్ రేటింగ్ కాకుండా త్రీస్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. మళ్లీ వీరిని సంప్రదించిన వ్యాపారి, మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వకుంటే రిఫండ్ చేయమంటూ తెగేసి చెప్పారని 'విచ్?' తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
నకిలీ రివ్యూలను గుర్తించడమెలా?
- రివ్యూలపై ఆధారపడకండి. ఆ వస్తువు గురించి లోతుగా అధ్యయనం చేసి, ఇతర రివ్యూలనూ చదవండి.
- రివ్యూలను రాసిన తారీఖులను ఒకసారి గమనించండి. ఎక్కువ రివ్యూలను తక్కువ సమయంలోనే రాసినట్లయితే, ఫేస్‌బుక్, ఇతర గ్రూపుల్లో పబ్లిసిటీ కోసం వాటిని రాయించి ఉండొచ్చు.
- రివ్యూలను రాసినవారి ఖాతాలపై క్లిక్ చేసి, వారు అన్ని ఉత్పత్తులకూ ఫైవ్ స్టార్ రేటింగే ఇచ్చారేమో తెలుసుకోండి.
- ఏవస్తువు గురించైనా పూర్తి అవగాహనతో రివ్యూలు రాయడం చాలా అరుదు.
సోర్స్: విచ్?
విచ్? గృహోత్పాదనలు, సేవల మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ నీల్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ అమ్మకందార్లు నకిలీ రివ్యూలతో ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
''నకిలీ వినియోగదారుల రివ్యూ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్‌లో అనుమతి లేదు. మా నిబంధనలను ఎవరైనా అతిక్రమించారని మీకు అనిపిస్తే, వెంటనే మా 'రిపోర్టింగ్ టూల్' ద్వారా తెలియజేయండి. మేం వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం'' అని ఫేస్‌బుక్ స్పందించింది.
ఈ విషయమై అమెజాన్ స్పందిస్తూ ''నకిలీ రివ్యూలను మేం అనుమతించం. కొనుగోలుదార్లు, అమ్మకందార్లు మా రివ్యూ నియమనిబంధనలను తప్పక పాటించాలి. లేనిపక్షంలో వారి ఖాతాలను తొలగిస్తాం'' అని తెలిపింది.
కానీ, నకిలీ రివ్యూలకు పూర్తి రిఫండ్ చేస్తామంటూ అమెజాన్ వెబ్‌సైట్ కొనుగోలుదార్లకు ఇచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులను కూడా ‘విచ్?’ సంస్థ బయటపెట్టింది.
ప్రపంచంలోనే ప్రఖ్యాత రివ్యూ వెబ్‌సైట్ 'ట్రస్ట్ పైలట్'లోకూడా కొందరు నకిలీ రివ్యూను ఎలా రాస్తున్నారన్న అంశాన్ని గత ఏప్రిల్ నెలలో 'బీబీసీ-5 లైవ్' దర్యాప్తు వివరించింది.
ఇవి కూడా చదవండి
- శబరిమల: కవిత, రెహానా ఆ 100 మీటర్లు ఎందుకు దాటలేకపోయారు?
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం.. అందుకోవాలంటే 30 ఏళ్లు ఆగాలి
- ఆదిపరాశక్తి ఆలయం: ఇక్కడ రుతుస్రావం అపవిత్రం కాదు.. పీరియడ్స్ సమయంలోనూ పూజలు చేయొచ్చు
- అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?
- భౌతికశాస్త్రం ముఖచిత్రాన్ని మార్చేసిన నలుగురు మహిళలు
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








