ఈ యువతికి నాన్న అంటే ఎందుకు అంత కోపం?

పాకిస్తాన్, తత్‌హీర్

పాకిస్తాన్‌కు చెందిన 22 ఏళ్ల తత్‌హీర్ వినూత్నమైన న్యాయపోరాటం చేస్తున్నారు. తన గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు ఉండకూడదని ఆమె పోరాడుతున్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.

తనకు చిన్నప్పుడే దూరమై, ఎన్నడూ తన బాగోగులు పట్టించుకోని మనిషి తన పత్రాల్లో ఎందుకని తత్‌హీర్ ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్ చట్టాల ప్రకారం గుర్తింపు పత్రాల్లో పిల్లల పేరులో తండ్రి పేరు ఉండాల్సిందే. తత్‌హీర్ దీనిని వ్యతిరేకిస్తున్నారు. ‘‘కావాలంటే నన్ను పాకిస్తాన్ పౌరురాలిగా గుర్తించండి, అంతే తప్ప మా నాన్న పేరు నాకు అవసరం లేదు’’ అని ఆమె కరాఖండీగా చెప్పేశారు.

వీడియో క్యాప్షన్, వీడియో: తండ్రి పేరు అంటే ఈ యువతికి ఎందుకంత ద్వేషం?

ఇదే విషయంపై తత్‌హీర్ 2017లో ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలు చేయగా కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇలాంటి కేసు తమ ముందుకు రావడం ఇదే మొదటిసారని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సుప్రీంకోర్టు తనకు న్యాయం చేస్తుందని తత్‌హీర్ ఆశాభావంతో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

పాకిస్తాన్, తత్‌హీర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)