ఇండోనేసియా సునామీ: 1200 దాటిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Reuters
ఇండోనేసియాను శుక్రవారం నాడు కుదిపేసిన భూకంపం, ఆ తరువాత విరుచుకుపడిన సునామీ సృష్టించిన విధ్వంంసలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వలయంలో చనిపోయిన వారి సంఖ్య 1200 దాటిందని అధికారులు ప్రకటించారు.
మంగళవారం నాడు 844 మంది చనిపోయినట్లు ప్రకటించారు. కానీ, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ ప్రజలు భారీ సంఖ్యలో చనిపోయిన వాస్తవం వెలుగులోకి వస్తోంది.
సులవేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పాలూ తీర ప్రాంతాన్ని సునామీ ముంచెత్తింది. బాధితులు తాగునీరు, ఆహారం, ఇంధనం కోసం అలమటిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
చాలా మంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.
కొండ చరియ విరిగి పడడంతో బురదనీరు చర్చిలోకి కొట్టుకువచ్చిన బురదలో 34 మంది విద్యార్థులు సజీవ సమాధి అయ్యారని ఇండోనేసియా రెడ్ క్రాస్ అధికారులు బీబీసీతో చెప్పారు.
జోనూగె చర్చి బైబిల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 86 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. వారిలో 34 మంది మృత దేహాలు లభ్యమయ్యాయి. కానీ, మిగతా 52 మంది విద్యార్థులు ఏమయ్యారో తెలియలేదు.
ఇవి కూడా చదవండి:
- ఇండోనేసియా భూకంపం: చర్చిలో 34 మంది విద్యార్థుల మృతదేహాలు
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- యాపిల్ ఉద్యోగి కాల్చివేత: యూపీలో విచ్చలవిడి 'ఎన్కౌంటర్ల'కు ఇదొక ఉదాహరణ
- వీగర్ ముస్లింలు: చైనా మైనారిటీ శిబిరాల్లో నిర్బంధ హింస
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- యాపిల్ ఉద్యోగి కాల్చివేత: యూపీలో విచ్చలవిడి 'ఎన్కౌంటర్ల'కు ఇదొక ఉదాహరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




