చైనాలో నాలుగు వేల వెబ్ సైట్ల మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
చైనా సుమారు 4 వేల వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అకౌంట్లను మూసివేసినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ షిన్‌హువా తెలిపింది. 'హానికారక' సమాచారానికి వ్యతిరేకంగా మూడు నెలల ప్రచారం అనంతరం ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ వెబ్‌సైట్లు కాపీరైట్ హక్కులను ఉల్లంఘించడంతో పాటు హానికారక విలువలను, అసభ్యతను, అశ్లీలాన్ని వ్యాపింపజేస్తున్నాయని పేర్కొంది.
అయితే, ఈ ప్రక్షాళనలో ఈ-బుక్స్‌ను ఉచితంగా అందజేస్తున్న వెబ్‌సైట్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇంటర్నెట్ మీద చైనా ప్రభుత్వానికి చాలా పట్టు ఉంది.
గతంలోనూ లాటరీ యాప్‌లు, పోర్నోగ్రఫీ, హింసాత్మక విషయాలను ప్రచురించే వెబ్‌సైట్లపై చైనా ఉక్కుపాదం మోపింది.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ విశ్లేషకురాలు కెర్రీ అలెన్ చైనాలో ఇలాంటివి సర్వసాధారణమే అని తెలిపారు.
''గతంలోనూ పలుమార్లు ఇలాంటి నిషేధాలు విధించారు. అయితే అవి సాధారణ ప్రజలు రోజూ చూసే వెబ్‌సైట్లు కాదు'' అని ఆమె తెలిపారు.
గూగుల్ ఒక కొత్త సెన్సార్డ్ చైనా సర్వీస్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు, స్థానిక నియమాల మేరకు అది కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తుందని, గత ఆగస్టులో వార్తలు వెలువడ్డాయి.
గూగుల్ ఈ వార్తలపై ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. అయితే దీనిని నిరసిస్తూ అనేక వందల మంది గూగుల్ ఉద్యోగులు కంపెనీకి లేఖలు రాశారు.
పారదర్శకతకు పేరొందిన గూగుల్, ఎలాంటి సర్వీస్‌ను అందిస్తోందో తెలుసుకునే హక్కు తమకు ఉందని వారు ఆ లేఖలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








