ఉజ్బెకిస్తాన్ స్కూళ్లలో ‘పొట్టి స్కర్ట్స్‘ వివాదం

ఫొటో సోర్స్, UZBEKISTAN TV 24
ఉజ్బెకిస్తాన్‌లోని మహిళా టీచర్లు చిన్న స్కర్టులతో పాఠశాలలకు వెళ్లడంపై ఆ దేశ జాతీయ టీవీ చానెల్ విమర్శలు చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, ఈ అంశంలో దేశ విద్యాశాఖ మంత్రి మహిళా టీచర్లను సమర్థించారు.
‘దేశంలోని కొందరు టీచర్లు, విద్యార్థులు వారికి ఇష్టమైన దుస్తుల్లో స్కూళ్లకు వస్తున్నారు. దీనివల్ల టీనేజీ విద్యార్థులు తరగతులపై కాకుండా టీచర్ల శరీరంపై దృష్టిపెట్టే ప్రమాదం పొంచి ఉంది‘ అని ఉబ్జెకిస్తాన్ 24 టీవీ ఓ టాక్ షోలో విమర్శలు చేసింది.
ఈ టీవీ చానెల్ బృందం ఒక కార్యక్రమంలో భాగంగా రాజధాని తాష్కెంట్‌లోని ఓ స్కూల్‌కు వెళ్లింది. అక్కడ కురచ దుస్తులతో స్కూల్‌కు వచ్చిన టీచర్లు, విద్యార్థినులను చిత్రీకరించింది. ఆ వీడియోను ప్రసారం చేస్తూ ''ఈ టీచర్ వేసుకున్న బట్టలు చూడండి, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాల్సిన వ్యక్తి ఎలా ఉన్నారు. ఇలాంటి దుస్తులు వేసుకొని పాఠాలు చెప్పడం సరైనదేనా? అని రిపోర్టర్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UZBEKISTAN TV 24
స్కూల్‌లో డ్రెస్ కోడ్ పాటించకపోవడంపై వివిధ రంగాల ప్రతినిధులు ఆ కార్యక్రమంలో విమర్శలు చేశారు. బిగుతైన దుస్తుల వల్ల వంధ్యత్వం వస్తుందని ఒక వైద్య విద్యార్థి ఆ ప్రోగ్రాంలో హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన విద్యాశాఖ మంత్రి షెర్జాద్ షెర్మతోవ్ మాట్లాడుతూ, 'యూనిఫాం గైడ్‌లైన్స్ తీసుకరావడం వల్ల ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చు' అని అన్నారు.
అయితే, సామాజిక మాధ్యమాల్లో ఈ టాక్ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాత్రికేయ ప్రమాణాలు పాటించలేదని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దేశం ఉత్తర కొరియాలా మారుతోంది. జర్నలిస్టులు నిజంగా ఈ దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే.. సమర్‌కండ్‌లో పుస్తకాలు లేని విద్యార్థులు, టాయిలెట్లు లేని స్కూళ్ల సమస్యల గురించి ప్రస్తావించండి' అని ఒక వీక్షకుడు కామెంట్ చేశారు.
అవమానకరం
రెండు రోజుల కిందట తాను పాల్గొన్న షోపై వివాదం తలెత్తడంతో మంత్రి షెర్మతోవ్ స్పందించారు. ఆ కార్యక్రమం గురించి ఫేస్‌బుక్‌లో ఖండించారు.
'నాగరిక సమాజంలో వ్యక్తులను బహిరంగంగా అవమానించడం ఆమోదనీయం కాదు. ముఖ్యంగా చిన్నారుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.'' అని పేర్కొన్నారు.
''టీచర్లను కించపరచడం ఆపండి, వారికి కొంతైన గౌరవం ఇవ్వండి. అసలే మనకు మంచి టీచర్ల కొరత ఉంది'' అని ఆయన రిపోర్టర్లను కోరారు.
ఇవి కూడా చదవండి:
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- రంజాన్ నెలలో ఉపవాసం చేస్తే శరీరానికి ఏం జరుగుతుంది?
- ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- BBC Special: ఆయుష్మాన్ భారత్‌కు అర్హతలేంటి? ఆరోగ్య శ్రీకి దీనికీ తేడాలేంటి?
- నడిసంద్రంలో గాయాలతో చిక్కుకుపోయిన భారత నౌకాదళ కమాండర్
- #HisChoice: ‘నేను ఒక మేల్ ఎస్కార్ట్, జిగోలో. శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే..’
- కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








