చీర్‌లీడర్స్: కళ్లు చెదిరే విన్యాసాలు

వీడియో క్యాప్షన్, వీడియో: 2024 వేసవి ఒలింపిక్స్‌లో చీర్‌లీడింగ్‌ను ఒక క్రీడగా ప్రవేశపెట్టాలా లేదా అన్న విషయంపై ఐఓసీ ఓ నిర్ణయం తీసుకోనుంది

చీర్‌లీడింగ్ అనేది అమెరికా క్రీడా సంస్కృతికి ఓ ప్రతీక. అయితే, ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

అన్నీ అనుకున్నట్లే జరిగితే 2024లో జరగబోయే వేసవి ఒలింపిక్స్‌లో ఇది ఒక క్రీడగా చోటు సంపాదించవచ్చు. నైజీరియాలోని లాగోస్ చీర్‌లీడింగ్ జట్టును బీబీసీ ప్రతినిధి కలిశారు.

వాళ్లు ఈ క్రీడపై అంతగా మక్కువ పెంచుకోవడానికి కారణాలేంటి? తమను ఒలింపిక్స్‌లో కూడా భాగం చెయ్యాలని ఎందుకు కోరుతున్నారో ఇలా చెప్పుకొచ్చారు.

''చీర్‌లీడింగ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు. అది జీవితంలో భాగం. చీర్‌లీడర్లుగా మేం జట్టుకు ప్రోత్సాహమివ్వడానికే శాయశక్తులా కృషి చేస్తాం.'' అని ఒకరంటే, ''అభిమానులు తమ జట్టు గురించి గర్వపడేలా చేస్తాం. స్టాండ్స్‌లో ఉన్న వాళ్లు తమ అభిమానాన్ని ఎలా చూపించాలో చేసి చూపిస్తాం'' అని మరో చీర్ లీడర్ బీబీసీకి చెప్పారు.

చీర్‌లీడర్ కావాలన్నది నా చిరకాల వాంఛ అని మరొకరు తెలిపారు.

అయితే, చీర్‌లీడింగ్ అంటే మెరిసే దుస్తులు వేసుకొని తళుకుబెళుకులతో నాట్యం చేయడం మాత్రమే కాదని మరొక చీర్ లీడర్ వివరించారు.

''ఈ ఆట ఆడాలంటే చాలా సాధన కావాలి. క్రమశిక్షణ, అంకిత భావం, ఆత్మవిశ్వాసంతో పాటు వ్యాయామం, క్రీడల్లో నైపుణ్యం కూడా ఉండాలి. వాటన్నింటికన్నా టీం స్పిరిట్ చాలా ముఖ్యం'' అని చెప్పారు.

2024 వేసవి ఒలింపిక్స్‌లో చీర్‌లీడింగ్‌ను ఒక క్రీడగా ప్రవేశపెట్టాలా లేదా అన్న విషయంపై ఐఓసీ ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)