ఈ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం.. ప్రపంచ నలుమూలల్లో ఇలా కనిపించింది

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గ్రీస్‌లో ఏథెన్స్ దగ్గర పోసిడాన్ ఆలయం వెనుక చంద్రుడు

ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్ర గ్రహణం భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపించింది.

రాత్రి 11.54 నిమిషాలకు చంద్ర గ్రహణం మొదలవగానే చంద్రుడు మెల్లమెల్లగా ఎర్రగా మారాడు. చంద్రుడు అలా మారడాన్ని 'బ్లడ్ మూన్' అని కూడా అంటారు.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని చాలా ప్రాంతాల్లో గ్రహణం కనిపించింది. శ్రీనగర్‌లో గ్రహణం సమయంలో చంద్రుడు కాస్త ఎర్రగా కనిపించాడు
బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లో చంద్ర గ్రహణం ప్రారంభమైన తర్వాత

చంద్ర గ్రహణం కోసం జనం కొన్ని గంటల వరకూ ఉత్సాహంగా వేచిచూశారు. భారత్‌లో చంద్ర గ్రహణం సమయంలో చాలా మంది నదుల్లో స్నానాలు కూడా చేశారు.

నాసా వివరాల ప్రకారం 21వ శతాబ్దంలో అత్యంత సుదీర్ఘ చంద్ర గ్రహణం ఇదే. ఈ చంద్ర గ్రహణం మొత్తం 3.55 నిమిషాల పాటు ఉందని నాసా తెలిపింది.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, స్విట్జర్లాండ్‌లో బ్లడ్ మూన్

సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమి చంద్రుడికి, సూర్యుడికి మధ్యలో వస్తే, మూడు గ్రహాలు తమ కక్ష్యల్లో వరుసగా వస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ పడడం వల్ల చంద్రుడు కనిపించదు.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒమన్ రాజధాని మస్కట్‌లో చంద్ర గ్రహణం సమయంలో సుల్తాన్ కాబుస్ గ్రేడ్ మసీదు

పౌర్ణమి రోజున సూర్యచంద్రులకు మధ్య భూమి వచ్చినపుడు దాని నీడ చంద్రుడిపై పడుతుంది. దానితో చంద్రుడిపై నీడ పడిన భాగం చీకటిగా అయిపోతుంది. అదే స్థితిలో మనం భూమిపైనుంచి చంద్రుడిని చూసినపుడు ఆ భాగం మనకు నల్లగా కనిపిస్తుంది. అందుకే దానిని చంద్రగ్రహణం అంటారు.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అబుధాబీలో షేక్ జయేద్ గ్రాండ్ మసీదు దగ్గర

ఈ చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా మినహా ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపించింది. యూరప్‌లోని చాలా భాగాల్లో, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించింది.

బ్లడ్ మూన్ ఇన్ సిడ్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిడ్నీలో చంద్ర గ్రహణం

భారత్‌లో ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని దిల్లీ, పూణె, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని నగరాల్లో చూశారు. కొన్ని ఛానళ్లు, వెబ్‌సైట్లు చంద్ర గ్రహణం దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్, కువైట్‌లో చంద్ర గ్రహణం ఫొటోలు

చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడు భూమి నుంచి అత్యధిక దూరంలో ఉన్నాడు. దీనిని అపోగీ అంటారు. అందులో భూమికి చంద్రుడికి మధ్య అత్యధిక దూరం 4,06,700 కిలోమీటర్లు ఉంటుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: చంద్రగ్రహణం వెనుక సైన్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)