#FIFA2018: మొదటిసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో క్రొయేషియా.. ఫ్రాన్స్‌తో ఆదివారం ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2018 పోటీలు 32 దేశాల మధ్య ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ టోర్నీ ఫైనల్లో తలపడే ఆఖరి రెండు జట్లు ఏవో తేలిపోయింది.
ఆదివారం ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది.
అదనపు సమయం వరకూ పొడిగించిన రెండో సెమీ ఫైనల్లో క్రొయేషియా ఇంగ్లండ్‌ను 2-1 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకే ఇంగ్లండ్ ఆధిక్యం సంపాదించింది. కీరన్ ట్రిప్పర్ అద్భుతమైన ఫ్రీ కిక్‌తో బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. మొదటి హాఫ్ వరకూ క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఇంగ్లండ్ ఆధిక్యం కొనసాగింది.

ఫొటో సోర్స్, Reuters
అదనపు సమయం వరకూ ఉత్కంఠ
కానీ సెకండ్ హాఫ్‌లో క్రొయేషియా పుంజుకుంది. 68వ నిమిషంలో క్రొయేషియా వైపు నుంచి సైమ్ వ్రసాల్జకో ఇచ్చిన పాస్‌ను ఇవాన్ పెరిసిక్ గోల్ పోస్ట్‌లోకి పంపించాడు.
మ్యాచ్ సమయం పూర్తయ్యే వరకూ రెండు జట్లూ మరో గోల్ చేయలేకపోయాయి. దాంతో ఆట అదనపు సమయానికి చేరింది.
108వ నిమిషంలో హెడర్ ద్వారా లభించిన పాస్‌ను మారియో మండుజుకిత్స్ గోల్‌గా మలిచాడు. క్రొయేషియాను ఆధిక్యంలో నిలిపాడు. ఇంగ్లండ్ గోల్ కీపర్ జార్డన్ పిక్‌ఫోర్డ్ బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్తుంటే ఆపలేకపోయాడు.

ఫొటో సోర్స్, PA
గణాంకాలలో కూడా క్రొయేషియా, ఇంగ్లండ్ కంటే మెరుగ్గా నిలిచింది. మ్యాచ్ సమయంలో 55 శాతం బంతి క్రొయేషియా ఆటగాళ్ల అదుపులో ఉంది. గోల్ పోస్ట్ లక్ష్యంగా క్రొయేషియా జట్టు ఏడు సార్లు షాట్స్ కొట్టింది. ఇంగ్లండ్ మాత్రం రెండు సార్లే అలా చేయగలిగింది.
క్రొయేషియా జట్టుకు 8, ఇంగ్లండ్ జట్టుకు నాలుగు కార్నర్స్ లభించాయి.
40 లక్షల మంది జనాభా ఉన్న క్రొయేషియా మొదటి సారి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఆడబోతోంది. కానీ 52 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరాలనుకున్న ఇంగ్లండ్ కల మాత్రం కలగానే మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- కత్తి మహేశ్: పోలీసులు ఎందుకు బహిష్కరించారు?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- హైదరాబాద్ నుంచి పరిపూర్ణానంద బహిష్కరణ
- ముంబయిలో మురికి వాడ.. ఇప్పుడు రంగుల లోకమైంది
- ‘అది మోక్షం కాదు, పిచ్చి’
- చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్పై ప్రశ్నలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








