ముంబయిలో మురికి వాడ.. ఇప్పుడు రంగుల లోకమైంది
ముంబయిలోని ఓ మురికి వాడ కొత్త రంగుల లోకంగా మారిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రెండు వేలకు పైగా స్వచ్ఛంద కార్యకర్తల కృషి ఫలితంగా ఖార్-దండా ప్రాంతంలోని ఇళ్లన్నీ ఇప్పుడు సరికొత్త రంగులతో మెరిసిపోతున్నాయి.
ఇంటికప్పులను సురక్షితంగా, అందంగా తీర్చిదిద్దడంతో.. ముంబయి నుంచి బయలుదేరే విమానాల్లోని ప్రయాణికులకు ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
గతంలో 'చల్ రంగ్ దే అసల్ఫా' పేరుతో ముంబయిలోని అసల్ఫా ప్రాంతంలో ఇలాగే రంగులు వేసి ఇళ్లను సుందరీకరించారు. ఇప్పుడు 'చల్ రంగ్ దే ఖార్' పేరుతో మరో మురికి వాడలో రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘ఇక్కడ ఇంటి పైకప్పుల మీద కూడా పని చేస్తున్నాం. కప్పులను వాటర్ ప్రూఫ్ చేస్తున్నాం. మంచి రంగులు అద్దుతున్నాం. వర్షాకాలానికి ఈ కాలనీని పూర్తిగా సిద్ధం చేశాం.’ అని స్వచ్ఛంద కార్యకర్తలు తెలిపారు.
‘‘ముంబయిలో వర్షాలు భారీగా పడుతుంటాయి. ఇలాంటి చోట ఉండే వారికి లీకేజి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మరో అయిదేళ్ళ దాకా ఆలోచించాల్సిన పనుండదు. పై కప్పుల మీద కూడా పెయింటింగ్ వేశాం. ఎందుకంటే, విమానాల్లో వెళ్లే వారికి ఈ రంగులు కనిపిస్తాయి. ఈ రంగులే మా గుర్తింపు. అందరి దృష్టినీ ఆకట్టుకోవడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి" అని చల్ రంగ్ దే సహ-వ్యవస్థాపకురాలు దేదీప్యా రెడ్డి చెప్పారు.

ఈ మురికి వాడలో మొత్తంగా 300 పైకప్పులు, 1200 గోడలకు రంగులు వేశారు. ఇది 52 మంది చిత్రకారులు, 2800 మంది స్వచ్ఛంద కార్యకర్తల కృషి ఫలితం.
ఇదంతా చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "ఇంతకు ముందు ఇక్కడ చాలా నిస్సారంగా అనిపించేది. రంగులు వేయడంతో ఇప్పుడు ఈ ప్రాంతమంతా ఇంధ్ర ధనస్సులా మారిపోయింది. ఇలాంటిది ఇంతకుముందు కార్టూన్ చిత్రాలలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడే కనిపిస్తోంది" అని స్థానికుడు చేతన్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.

ఇక్కడి ఇళ్ల గోడల మీద ప్రపంచ నలుమూలల్లో ఉన్న అనేక ప్రముఖ ప్రదేశాల చిత్రాలను కూడా వేస్తున్నారు.
"ఇక్కడి ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతోందో పెద్దగా తెలియదు. అందుకే, వారికి ఆమ్‌స్టర్ డామ్ వంటి ప్రదేశాలను ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాం. ఖార్‌ను, ఖార్స్టర్డామ్గా మార్చేశాం" అని హార్దిక్ అనే చిత్రకారుడు వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ రైతులు కరువు నేలలో కోట్లు పండిస్తున్నారు
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
- ఒంటి చేత్తో సిరుల పంట పండిస్తున్నాడు!
- బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- కేంద్ర బడ్జెట్: ‘ఓట్ల కోసం కలల వల’
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









