సూప్‌లో పడి మరిగిపోకుండా తప్పించుకోవడానికి ఈ క్రేఫిష్ ఏం చేసిందో చూడండి

క్రేఫిష్

ఫొటో సోర్స్, Getty Images

ఎండ్రకాయలు, తేళ్లు వంటి ప్రాణులు తమ కొండీల సాయంతో పోరాడుతాయి, వేటాడుతాయి. చైనాలోని ఒక క్రేఫిష్ మాత్రం కొండీల సాయంతో తన ప్రాణాలు కాపాడుకుంది. ఆ క్రమంలో అది తన రెండు కొండీల్లో ఒకదాన్ని వదిలించేసుకుంది కూడా!

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఇప్పటికి పదిహేను లక్షల సార్లకు మించి చూశారు. జూక్ అనే వ్యక్తి ఈ వీడియోను 'వీబో'లో పోస్ట్ చేశారు.

చైనాలోని ఒక రెస్టారెంట్లో.. సూప్ మరిగిపోతోంది. ఒక క్రేఫిష్ ఆ మరుగుతున్న సూప్‌లో పడిపోయింది. కొన్ని క్షణాల్లో సూప్‌ వేడికి ఆ క్రేఫిష్ బలయ్యేదే..

కానీ అది ఆ పాత్ర నుంచి బయటపడ్డానికి అష్టకష్టాలు పడింది. తప్పించుకునే ప్రయత్నంలో దాని ఎడమ కొండీ సూప్‌‌లో చిక్కుకుపోయింది. బయటపడటం కష్టమైంది.

అలా అని అక్కడే ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఇక చేసేది లేక, తన ఒక కొండీని కత్తిరించేసుకుని బతుకుజీవుడా.. అంటూ బయటపడింది.

వీడియో చూసిన వాళ్లు ఈ క్రేఫిష్‌కు ఫిదా అయిపోయారు. దాన్ని చంపొద్దని, దానికి స్వేచ్ఛ ఇవ్వాలని కామెంట్ బాక్స్‌లో కోరినట్లు తైవాన్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

''ఆ క్రేఫిష్‌ను చంపలేదు. దాన్ని నేనే పెంచుకుంటున్నాను. అది నా పెంపుడు జీవి'' అని జూక్ రిప్లై ఇచ్చారు.

చైనాలో రోజురోజుకీ క్రేఫిష్ వంటలకు గిరాకీ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)