కెనడాలోని భారతీయ రెస్టారెంట్‌‌లో పేలుడు: 15 మందికి గాయాలు

కెనెడా బాంబు పేలుడు

ఫొటో సోర్స్, Peel Paramedics

కెనడాలోని మిస్సిస్వాగా‌లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్‌లో నాటు బాంబు పేలడంతో 15 మంది గాయపడ్డారు. దేశంలోని 6వ అతిపెద్ద పట్టణం మిస్సిస్వాగా.

గురువారం రాత్రి నగరంలోని బాంబే భెల్ రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు అనుమానితులు ఆధునాతన పరికారాలతో పేలుడుకు పాల్పడ్డారు అని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో గాయపడిన 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పేలుడు జరిగిన తర్వాత సమీపం నుంచే ఇద్దరు అనుమానితులు పారిపోయారు.

స్థానిక కాలమాన ప్రకారం రాత్రి గం 10.32 నిమిషాలకు పేలుడు గురించి సమాచారం అందిందని పీల్ రీజనల్ పోలీసులు అధికారులు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అనుమానితుల సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. వారిద్దరు నీలి రంగు జీన్ ప్యాంట్ వేసుకున్నారని, ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు.

పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఘటనాస్థలంలో భారీగా పోలీసులను మోహరించారని కెనడియన్ బ్రాడ్ కాస్టర్ సీబీసీ పేర్కొంది. పేలుడు జరిగిన ప్రాంతంలోని ఇంకా ప్రమాదం పొంచి ఉందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఒక అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)